2016-17 రాష్ట్ర బ‌డ్జెట్ కు  మంత్రులు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. ఇందుకోసం ఆయా మంత్రులు స‌చివాల‌యంలో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాద‌య శాఖ మంత్రి ఇంద‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  రాష్ట్రంలో కొత్త ఆల‌యాల నిర్మాణం, చారిత్ర‌క‌, పురాత‌న ఆల‌యాల అభివృద్ధి పై  ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇప్ప‌టికే ప్రతి ఏటా యాధాద్రికి, వేముల వాడ‌కు రూ. 100 కోట్ల బ‌డ్జెట్ ను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి మ‌రింత పెంచే అవ‌కాశాలు ఉన్నాయని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ సారి ఎస్సీ, ఎస్టీ కాల‌నీల్లో నిర్మించే రామాల‌యాల నిర్మాణానికి భారీగా నిధుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఒక్కొక్క ఆల‌యాల నిర్మాణానికి రూ. 10 ల‌క్ష‌లు కేటాయించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేశారు.  సీజీయ‌ఫ్ కు రూ. 100 కోట్లు నిధులు కేటాయించాల‌ని వ‌చ్చే బ‌డ్జెట్ లో నిధులు కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి కోరునున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. నిధుల కేటాయింపు జరిగితే నూత‌న ఆల‌యాల నిర్మాణం, దేవాల‌యాల పునరుద్ద‌ర‌ణ‌కు వాటిని ఉప‌యోగించే వీలుంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ సారి ధూప దీప నైవేధ్యం కింద కొత్త‌గా ఆల‌యాల‌ను చేర్చే అవ‌కాశం ఉంటుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. కామ‌న్ గుడ్ ఫండ్ లో నిధులు కొర‌త ఉన్నందున్న ఈ బ‌డ్జెట్ లో ఆద‌నంగా నిధులు మంజూరు చేసేలా ప్ర‌భుత్వాన్ని  కోరాల‌ని క‌మిటీ నిర్ణ‌యించింది. 


వ్య‌వ‌సాయ బడ్జెట్ పై పోచారం స‌మీక్ష‌..


తెలంగాణ రాష్ట్ర 2016-17 ఆర్ధిక బ‌డ్జెట్ గానూ  వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయా ఆధికారుల‌తో  స‌మీక్ష జ‌రిపారు. ఈ ఏడాది బ‌డ్జెట్ రైతు సంవ‌త్స‌రంగా మారాల‌న్నారు. రైతుల‌కు ఎరువుల‌ను విత్త‌నాల‌ను అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రుణ రహిత రైతే ల‌క్ష్యంగా ఈ సారి బ‌డ్జెట్ ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్ లోని హార్టిక‌ల్చ‌ర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో హార్టిక‌ల్చ‌ర్ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష జరిపారు. మెద‌క్ జిల్లా ములుగు మండ‌లంలోని తునికి బొల్లారం గ్రామం లో 200 ఎక‌రాల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు పోచారం వెల్ల‌డించారు.  అంతేకాకుండా ఈ సారి యువ‌త ఉపాధి క‌ల్ప‌న కూడా ఏర్పాటు చేసే లా బ‌డ్జెట్ ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. నాబార్డ్ స‌హాయంతో 2,500 కోట్ల  రూపాయ‌ల ప్ర‌భుత్వ గ్యారెంటితో కూడిన ప్ర‌త్యేక రుణాన్ని రైతుల కొర‌కు అందిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. త్వ‌ర‌లో వ్య‌వ‌సాయ పూర్తి బ‌డ్జెట్ ప్ర‌తిపాదినలు త‌యారు చేయ‌నున్న‌ట్లు  మంత్రి తెలిపారు.


మంత్రి తుమ్మ‌ల బ‌డ్జెట్ స‌మీక్ష‌..


రోడ్లు భ‌వ‌నాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2016-17 బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు పైన‌ల్ చేయాల‌ని రోడ్లు భ‌వ‌నాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ  మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో ఆర్అండ్ బీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారుల‌తో బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై సమీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చే ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను నిర్ధిష్ట‌మైన ఫ‌లితాల ఆధారంగా త‌యారు చేయాల‌న్నారు. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో కొన్ని యూనిట్లు వేరే శాఖ లో ఉన్నందున స్కీంల‌ను శాఖ ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని  ఒకేగొడుగు కిందికి తీసుకు రావ‌డానికి చ‌ర్య‌లు తీస‌కోవాల్సిందిఆ ఆదేశించారు. మొత్తం బ‌డ్జెట్  ప్ర‌తిపాద‌న‌ల‌ను నిర్ధిష్ట‌మైన టార్గెట్లు... వాటిని అందుకునే విధంగా ప్ర‌తిపాద‌న‌లుండాల‌ని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: