తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ హిస్ట‌రీ దాదాపుగా ముగిసిన‌ట్టే. ఇక మిగిలింది ఏపీలో, ప్రాంతాలే వేరైనా హిస్ట‌రీ మాత్రం సేమ్ టు సేమ్ . ఇది ఆంద్ర‌ప్ర‌దేశ్ తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్య‌త్తు. తెలంగాణలో అంటే ప్ర‌తిప‌క్షంలో ఉంది, అంతేకాకుండా  కేసీఆర్ చ‌రిష్మా క‌ల నాయ‌కుడు కావ‌డం.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కావ‌డం.. తెలంగాణలో ఆయ‌న ప్ర‌కటించే నూత‌న ప‌థ‌కాలు మెచ్చి అక్క‌డి ప్రజలు పూర్తిగా గులాబీ పార్టీనే న‌మ్ముతున్నారు కాబ్బ‌టి ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు ప‌ర్వం కొన‌సాగుతుంది. మ‌రి ఆంధ్ర ప‌రిస్థితి వేరు... తెలుగుదేశం పార్టీ ఏపీ అధికారంలో ఉంది కదా? ఎందుకు ఆంధ్ర‌లో కూడా హిస్ట‌రీ రిపీట్ అవుతుంద‌న్న అనుమానాలు రాక‌మాన‌వు. ఆ పాయింట్ నే ఇప్పుడు డిస్క‌స్ చేద్దాం.  తెలంగాణ‌లో దిన దిన గండంగా మారుతోంది టీడీపీ ప‌రిస్థితి. ఇక్క‌డ పార్టీ భ‌విష్య‌త్తుపై పెద్ద‌గా హోప్స్ లేవు.  తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప‌త‌నం వైపు సాగుతోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన అధినాయ‌కుడు చంద్ర‌బాబు కూడా పూర్తిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పైనే దృష్టి పెట్టారు. దీంతో పార్టీకి చెందిన ప్ర‌ముఖ నాయ‌కులు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. 


తెలంగాణ లో శాస‌న స‌భ ప‌క్ష‌నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీని వీడిపోవ‌డం కోలుకోలేని దెబ్బ‌. గ‌త వారంలోనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైకిల్ దిగేసి కారెక్కేశారు. గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశం త‌ర‌పున ఎమ్మెల్యే లుగా గెలిచిన వారిలో 9మంది ఇప్ప‌టికే గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అందులో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డం గ‌మ‌నించాం. స‌మీఫ భ‌విష్య‌త్తులో ఆ లిస్టు లో సంఖ్య పెరిగే అవ‌కాశాలే ఉన్నాయి. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల‌, గ్రేట‌ర్ ఎన్నిక‌లు...తెలంగాణ‌లో దేశం జాడ‌లు లేకుండా చేసేశాయి. తెలంగాణ లో పార్టీ ప‌రిస్థితిని ఎలా చ‌క్క‌దిద్దాలో చంద్ర‌బాబుకు అర్ధం కావ‌డంలేదు. దేశం నుంచి వ‌ల‌స‌ల్సి ఆపే మంత్ర దండం ఏదీ క‌నిపించ‌డంలేదు. అయితే ఆ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రాలో ప‌డుతోంది. తెలుగుదేశం పార్టీ బ‌ల‌హీన పడుతోంద‌న్న భావ‌న ఆంధ్రా ప్ర‌జ‌ల‌లో క‌ల‌గ‌డం స‌హ‌జం. కాబ‌ట్టి, దాన్ని ఈ స్థాయిలోనే మార్చేయాల‌న్న ఉద్దేశంతో....భారీ ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది అధికార టీడీపీ.


ప్రదాన ప్ర‌తిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తున్నారంటూ దేశం అనుకూల మీడియా డ‌ప్పుకొట్టిన సంగతి విదిత‌మే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది నాయ‌కులు వచ్చేస్తున్నార‌నీ...నేడో రేపో ప‌చ్చ‌తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ద‌మైపోయిందంటూ ప్ర‌చారం సాగించారు. అయితే.. ఈ ప్ర‌చారం బూమ్ రాంగ్ అయింది. వైకాపా నుంచి ఏ ఒక్క‌రూ దేశం పార్టీ వెళ్ల‌డం లేదంటూ జిల్లాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కోట్లు గుమ్మ‌రించిన దేశం గ‌డ‌ప తొక్కేది లేద‌ని వైకాపా నేత‌లు ప్రకటిస్తున్నారు. దీంతో తెలుగుదేశం డొల్ల‌త‌నం మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైంది. అయితే.. ఎలాగైనా స‌రే కొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌ల్ని  ఈ ద‌శ‌లో పార్టీకి తెచ్చుకుంటే బాగుంటుంద‌న్న ఉద్దేశంతో తెర‌వెన‌క బేర‌సారాలు సాగుతున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాకి చెందిన ఒక మంత్రిగానే మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌.


అయితే... అవేవీ ఫ‌లించ‌క‌ముందే దేశం నాయ‌కులు హ‌డావుడి చేసేశారు. దేశం అనుకూల మీడియాలో హ‌డావుడి సృష్టిస్తే త‌ట‌స్థులు దేశం వైపు వ‌చ్చేస్తార‌న్న‌ది వారి వ్యూహం కావొచ్చు. అయితే, దీంతో ఉన్న ప‌రువు కాస్తా కృష్ణాన‌ది పాలైంది!  పైగా, తెలంగాణ‌లో మునిగిన‌ట్టే ఆంధ్రాలో కూడా దేశం త్వ‌ర‌లో ముగినిపోబోతున్న పార్టీ అంటూ వైకాపా నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు దేశం నుంచి స‌రైన స‌మాధానాలు కూడా రావ‌డం లేదు. వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హించి వాపును బ‌లుపుగా చూపిద్దాం అనుకున్నారు. కానీ, అనుకున్న‌దొక్క‌టీ అయ్యింది ఇంకొక్క‌టీ అన్న‌ట్టు మారింది. ఇక అధినేత చంద్ర‌బాబు నాయుడు కుల రాజకీయాలు చేయ‌డంతో దిట్టా. ఆయ‌న నాటి నుంచి కులాల‌ను ముందుకు వేసి రాజకీయ ల‌బ్ధి పొందుతూ ఉంటారు. గ‌తంలో కూడా కాపు సామాజిక వ‌ర్గానికి అన్యాయం చేశార‌న్న వాద‌న ఉంది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కూడా దాదాపు చంద్ర‌బాబు ఎక్కువ శాతం ప్రొత్స‌హించార‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆయ‌న తొవ్విన గొతి అయ‌నే ప‌డతారన్న వాద‌న‌లు ఉన్నాయి. ఇప్పుడా కులాల ర‌గ‌డ మ‌రోసారి రిపీట‌య్యింది. 


కాపు సామాజిక వ‌ర్గాన్ని బీసీలో చేర్చుతామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు బీసీల‌కు ఎలా స‌ర్దుబాటు చేస్తారో ఇప్పుడు లక్ష కోట్ల ప్ర‌శ్న‌. ఈ కుల గొడ‌వ‌లన్నీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో ప్ల‌స్ పాయింట్ గా మారే అవ‌కాశాలు ఉన్నాయి. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ కళ్యాణ్ మొన్నీమ‌ద్యే వైకాపా నేత అంబటి రాంబాబు కూతురు వివాహానికి రావ‌డం, రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది, ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌ట్టి ప‌ట్టున్న కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే మాత్రం అది చంద్ర‌బాబు పథ‌నానికి నాందిగానే గుర్తించొచ్చు. ఇక తాజాగా మ‌రోసారి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఇష్యూ నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది. ఏ క్ష‌ణంలో నైనా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఉద్య‌మం తీవ్ర త‌ర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్య‌మ నేత మంద కృష్ట మాదిగ చంద్ర‌బాబు పై తీవ్రంగానే స్పందించారు. మాదిగ జాతిని చంద్ర‌బాబు విస్మ‌రించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రోవైపు రాజ‌ధాని కోసం రైతుల భూముల‌ను సేక‌రించ‌డం పై రైతులు క‌న్నేర్ర  చేశారు. 


తెలంగాణ లో ఉన్న ప‌రిస్థితులు వేరు. ఆంధ్ర‌లో ఉన్న పరిస్థితులు వేరు. కాపు సామాజిక వ‌ర్గం ఎప్పటి నుంచో బీసీలుగానే గుర్తింపు ఉంది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై ఇప్ప‌టికే అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి నివేదించారు కేసీఆర్ స‌ర్కార్. ఇచ్చిన హామీలను నేర‌వేర్చ‌డంలో చంద్రబాబు వైఖ‌రీ నాటి నుంచి దాట‌వేత దొర‌ణినే అన్న విష‌యం ఇప్పిట‌కే ఆంధ్ర ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. ఇక‌పోతే ఈ మ‌ద్య‌కాలంలో జరిగిన హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఆంధ్రా సెటిల‌ర్ల చంద్ర‌బాబు కు గ‌ట్టిషాకే ఇచ్చారు. ఇక ఆంధ్రాలో దేశం పార్టీ  ఉన్న ప‌రిస్థితిని గ‌న‌క గ‌మ‌నిస్తే తెలంగాణ‌లో ఉన్న పరిస్థితి రిపీట‌య్యే అవ‌కావాలు లేక‌పోలేదు.  ఒక విధంగా గ‌మనిస్తే ఇద్ద‌రు చంద్రుల పాల‌న‌లో చంద్ర‌బాబు కంటే కేసీఆరే బెట‌ర్ అన్న వాద‌న ఆంధ్ర ప్ర‌జ‌ల్లో  కూడా ఉంది. ఇప్ప‌టికైనా దేశం ధోర‌ణి మార్చుకోక‌పోతే నేడు తెలంగాణ‌లో ప‌ట్టిన గ‌తే ఆంధ్రాలో ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: