ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక పక్క కమ్మ - కాపు గొడవల్లో బిజీ గా ఉన్నారు. సినిమా వాళ్ళయినా - రాజకీయ నాయకులైనా - సామాన్యులైనా ఎన్నడూ లేనంతగా మొన్న జరిగిన కాపు గర్జన తరవాత ఈ విషయం మీద ఆసక్తితో చర్చలు పెడుతున్నారు. కానీ రాష్ట్ర భాజాపా మాత్రం సైలెంట్ గా నిమ్మకు నీరేత్తనట్టు గా వ్యవహరిస్తోంది ఈ విషయంలో. కాంగ్రెస్ నుంచి బీజేపీ కి వచ్చిన పురందరీస్వరి, కావూరి ల పేర్లు మాత్రమే ఇప్పుడు బీజేపీ లో వినిపిస్తున్నాయి.

 

పురందరీస్వరి వైజాగ్ నుంచీ పోటీ చేసి గెలిచి ఆ తరవాత రాయలసీమకి వచ్చారు. రాయలసీమకి వచ్చిన తరవాత వైజాగ్ సంగతే మరచిపోయారు ఆమె. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నంత కాలం ఆమె తమ సామాజిక వర్గానికి సేవ లో బిజీ గా గడిపారు , మరొక పక్క కావూరి చంద్రబాబు కి కావలసిన వ్యక్తి. బంధుత్వం కూడా ఉంది. బాబు కి స్వయంగా నచ్చే కార్పరేట్ రాజకీయ వేత్త కూడా ఆయనే. మధ్యలో సోము వీర రాజు అప్పుడప్పుడూ మెరుస్తున్నారు.

 

 

 ఈయన కూడా కాపు సామాజిక వర్గమే గోదావరి మనిషి, కాస్త నోటికి అడ్డూ అదుపూ ఉండకుండా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు మీద యమా సీరియస్ అవుతూ ఉంటారు. వెనకాల పవన్ కళ్యాణ్ అండదండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఒకరికి కాపు కోటా లో మంచి పదవి ఇచ్చి కాపులని కాపు కాచే పని భాజాపా చెయ్యాలి కానీ ఇప్పటి వరకూ అలాంటిది ఏమీ చెయ్యడం లేదు. ఇక భాజాపా మీద కాపు జనాలు ఆసక్తి ఎలా చూపిస్తారు ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: