రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం సీఎం కేసీఆర్ ఇంత పెద్ద చిట్టాతో హస్తినాకు వెళ్ల‌డం దాదాపుగా ఇదే మొద‌టి సారిగా చెప్పొచ్చు. గ‌తంలో వెళ్లినా ఆయ‌న ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ కు రావాల‌సిన నిధులు గురించి ఇంత‌గా ప్ర‌స్తావించింది లేదు. అయితే హైకోర్టు విష‌యంలో టీఆర్ఎస్ ఎంపీ లు తప్ప ఆయ‌న ఎప్పుడు కేంద్రం దృష్టి కి తీసుకెళ్ల‌లేదు క‌దా.. వీలు చిక్కిన‌ప్పుడల్లా కేంద్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శస్త్రాలు సందిచేవారు.అయితే తాజాగా ఒక్క‌సారి ఆయ‌న కేంద్రంతో ఇంత సానిహిత్యంగా ఉండ‌టంతో ఆయ‌న మ‌రేమైనా వ్యూహాలు ప‌న్నుతున్నారా అన్న వార్త‌లు గుప్పుమంటున్నాయి.


వాస్త‌వానికి కేసీఆర్ ఏ పార్టీనైనా వాడుకోవ‌డం అంటే తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ తెలిసినంత వ్యూహాలు మ‌రెవ్వ‌రికి రావు. గ‌తంలో ఆయ‌న అన్ని పార్టీల‌తో పొత్తు కోసం త‌లుపులు త‌ట్టిన సంగతి విదితమే. అది రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఇప్పుడు వేరు.. ఆయ‌న  రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కానీ కేంద్రంలో అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఇక ఉపేక్షించేదిలేద‌ని కేంద్రం తో  పొత్తు పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌ల‌తోనే హ‌స్తినాకు ప‌య‌న‌మ‌య్యార‌ని బోగాట్ట‌.


తాజాగా దేశంలో రెండో రాజ‌ధానిగా పేరున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఊహించ‌ని రీతిలో గెలుపు సాధించారు కేసీఆర్. దీంతో ఆయ‌న తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ప్రాంతీయ రాజ‌కీయ పార్టీగా ఎదిగారు. ఆయ‌న ఇక కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే వచ్చే నిధులు రావ‌డం సుల‌భంగా వ‌స్తాయి. దీంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునే వీలు సుల‌భ‌త‌రం అవుతుంద‌న్న‌ ఆలోచ‌న‌ల‌తో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక మ‌రోవైపు కేంద్ర మోడీ స‌ర్కార్  కూడా కేసీఆర్ లాంటి నాయ‌కుడితో పొత్తు పెట్టుకుంటే మంచిదేనన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌త కొద్ది రోజులు బీజేపీ- టీడీపీ ఉమ్మ‌డి ఘోర ప‌రాభ‌వం కావ‌డం.. తెలంగాణ‌లో పూర్తిగా ప‌ట్టు పొవ‌డంతో ఇక కేసీఆర్ తో స్నేహం చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.  ఇదే నిజ‌మైతే  గులాబీ తో బీజేపీ  దోస్తి చేస్తుంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: