రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత ఇండిపెండెంట్ విద్యుత్ ప్రాజెక్టులకు కెజి బేసిన్ డి 6 నిక్షేపంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఇందన శాఖ కార్యదర్శి ఉమాశంకర్ను ట్రాన్స్ కో ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హీరాలాల్ సమారియా కోరారు.  రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం వల్ల ఏర్పడిన పరిస్థితులను కేంద్ర,. పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులకు విరించటానికి శుక్రవారం సమారియా ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు రాష్ట్ర ఇందనం శాఖ ముఖ్యకార్యదర్శి దినేష్ కుమార్తో ఆయన సుధీర్ఘ చర్చలు జరిపారు  రాష్ట్రంలో ఉన్న ఆరు ఐపీపీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాటానికి రోస్టరింగ్ పద్దతిలో కె.బి. బేసిన్ డి6 నిక్షేపాల నుంచి గ్యాస్ సరఫరా చేయాల్సిందిగా ట్రాన్స్ కో ఛైర్మన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు 13.65 ఎంఎంఎస్ సిఎండి సహజవాయువు అవసరం కాగా అందులోంచి కేవలం 6.43 ఎంఎంఎస్ సిఎండి గ్యాస్ స్వీకరిస్తున్నామని దాని ప్రకారం సుమారు 7.22 ఎంఎంఎస్ సిఎండి గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఫలితంగా సుమారు 2760 మెగావాట్ల పూర్తి సమార్థ్యం లోంచి దాదాపు 1600 మెగావాట్లు నిరుపయోగాం ఉందని సమారియా ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కేటాయింపు లేదనందున 2400 మెగావాట్లు ఉత్పత్తి సామర్ధ్యం గల ప్లాంట్లు ఇంకా ఉత్పత్తిని ప్రారంభించలేదని ఆయన అన్నారు.  ఈ నేపధ్యంలో ఢిల్లీ వెళ్లిన సమారియా తమిళనాడులోని వల్లూరులో రాష్ట్రవాటా 178 మెగావాట్ల గల ఎన్టీపీసీ ప్రాజెక్టుకు 300 మెగావాట్ల వాట గల కుదున్కులం ప్ ప్రాజెక్టులను వేగవంతం చేసే విషయమై తమిళనాడును ఆదేశించాలని కేంద్ర ఇందన శాఖ మంత్రిని సమారియా కోరనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: