అమరావతి ఆవిర్భావమంతా అనుమానాస్పదమౌతున్న ఈ తరుణంలో ఒక ప్రసారమాద్యమం డాక్యుమెంట్లతో సహా ప్రచురించి బలమైన అరోపణ "అమరావతి నగరంలో భూదందా" ను విస్పోటనం లా వెలుపలకు తెచ్చినప్పుడు, ప్రభుత్వం హుందాగా, న్యాయవిచారణ జరిపించి దోషులను శిక్షించవచ్చు. దీనికి ప్రభుత్వానికి అడ్డు వచ్చిన అంశాలేమిటి? ఈ ఆరోపణను అగ్నిపరిక్ష గా స్వీకరించి తమ ‘సత్యసందత’ ను నిరూపించు కొనే విలువైన అవకాశం వదులు కోవటం టిడిపి అభిమానుల కు కూడా అసంతృప్తి కలిగిస్తుంది.  సిబిఎన్ రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించిన ప్రాంతవిషయంలో (11) జిల్లాల ప్రజలు అసంతృప్తి తో వ్యతిరేకించారు. అమరావతి ప్రతిపాదన అంశంలో ఈ క్రింది విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.


1. 'రైస్-బౌల్ ఆఫ్ ఇండియా' గా పేరుబడ్డ ‘కృష్ట-గుంటూర్’ జిల్లాల పంట భూములను కాంక్రీట్ అరణ్యంగా మార్చటం విషయంలో ఏపి లోని (11) జిల్లాల ప్రజావ్యతిరేకత తో పాటు ఇతరులు కుడా హర్షించటంలేదు.


2. విశ్వనగరాన్ని నేనొక్కడినే నిర్మించగల నని తనను తాను తప్ప ఇంకెవరూ నిర్మించలేరంటూ డంబాలు కొట్టుకొనే చంద్రబాబు ఉదాహరణకు సైబరాబాద్ ను చూపిస్తున్నారు. ఈ సైబరాబాద్ భూములు కూడా కొందరు ముందుగానే కొనేసి (ఇన్సైడర్ ట్రేడింగ్) జాతిసంపదను కొల్లగొట్టారని తెలంగాణా ప్రజలు పూర్తిగా నమ్మారు. తెలంగాణా ఆవిర్భావానికి ఆజ్యం పోసిన అంశాల్లో ఈ సైబరాబాద్ భూదందా ఒకటి. అంతేకాదు ఆ సంపద ఎవరిసొత్తో ఎవరు దోచుకున్నారో టి-ప్రజలకు అర్ధమవబట్టే టి -ఉద్యమం అంత బలంగా విజయవంతమైంది. సైబరాబాద్ అనుభవమే బాబును ఈ విశ్వనగర నిర్మాణానికి ప్రోత్సాహపరిస్తే అది పెద్ద ప్రమాదమే. ఎందుకంటే అనుభవం లోనే “అవినీతి ప్రణాళికా” దాగిఉంది.

అందుకె సాక్షి బయటపెట్టీన అమరావతి భూదందాలో, టిడిపి మంత్రులకు, నాయకులకు, అస్మదీయులకు సంభందం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. శాసనసభలో ప్రభుత్వం మందబలంతో, సభాపతి సహకారంతో గెలవచ్చు. కాని (5) కోట్ల ప్రజల మనసులో నుంచి ఈ మచ్చ పోదు. సైబరాబాద్లో సాధారణ ప్రజలకు చోటులేదు. స్థానిక ప్రజలకు కూడా. అంతగా దోచబడింది. అమరావతి అనగానే గురివింద కింద మచ్చ తరతరాలకు గుర్తుకువస్తుంది. అందుకే అమరావతి అంద్రులు మెచ్చేని రాజదాని కాదు. అది కొందకే సొంతం. అలా ప్రణాళికా బద్దంగా నిర్మిస్తు న్నారు. ఒక కులాదిపత్య ప్రాంతంలో, 70 నుంచి 80 శాతం భూమి ఎంపికచేయబడ్డ వ్యక్తులు వారి అనుచరులకే స్వంతమైనప్పుదు అదెప్పటికి ప్రజా రాజధాని కాదు.

3. నిరుపేదల భూములను భయపెట్టి వారి స్వేదార్జిత భూసంపదను దోచుకుంటే నిరుపేదల ఉసురు ఆ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతుందా?

4. అమరావతి సంస్కృతి ఇప్పటికే "కాల్-మని, దాని ప్రెరేపితగా వనితల దన, మాన,ప్రాణాలను హింసించి హరించటం" ప్రారంభమైంది.

5. తెలంగాణాలో 'ఓటు కు నొటూ” కేసులో నిండా ఇరుక్కున్న బాబు హైదరాబాద్ నుండి ఏపి ని పరిపాలించలేక పారిపోయివచ్చి నిర్మిస్తున్న నగరం ఈ అమరావతి. అలాంటి నగరం ఏ సంస్కృతికి దర్పణం. పునాదుల్లోనే భీతి, అవినీతి, అక్రమాలు ఉంటే ప్రజలకు అక్కడ నిర్భీతిగా, నీతిగా, నిజాయతీగా ఎలా బ్రతుకుతారు? అప్పుడు ఇతర ప్రాంతాల వారు దొంగలకు, ద్రోహులకు, రేపిస్తులకు, అవినీతిపరులకు మా దగ్గర మీరు ఉండలేరు అమరావతికి వెళ్ళిపోండి అనైనా అనటం జరుగుతుంది.

6. ఇక్కడ (4) జిల్లాల రాయల సీమ ప్రజలు అమరావతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

7. శాసనసభలో విపక్షం అమరావతి భూముల దందా పై విచారణ జరపమంటే (అవిస్వాస తీర్మాన సమయంలో) దానిపై జగన్ అసమర్ధతతో పొరపాటు జరగటాన్ని-జుడ్జిలపై దాడి చేశారంటూ విపక్షంపై మందబలంతో ఏదురు దాడి చేసి అసలు ప్రజలకు చెందిన భూదొపిడి అంశాన్ని అధికారపక్షం దారి మళ్ళించి విచారణను తప్పించు కోవటం కూడా ఒక కుట్ర, కుతంత్రం, లాంటివే. ఈ అంశం కూడా అమరావతి నిర్మాణం లాంటి పవిత్ర కార్యక్రమానికి మకిల పట్టిస్తున్నాయి "మాహిష్మతికి మకిల పట్టినట్లు". తరవాత మాహిష్మతికి మకిల వదిలి ఉంటుంది. అమరావతి ప్రభుత్వానికి ఆగతి పట్టకుండా చూస్తే మంచిది. దీనికి నిఘా సంస్థలతో కాని, విపక్షాలతో కూడిన జాయింట్ పార్లమెంటరి కమిటీ గాని ప్రభుత్వమే వేసి అపవాదు నుండి తప్పుకుంటే అమరావతి వస్తు-ప్రతిష వృద్ది చెందుతుంది.


8. రాష్ట్ర సంపదతో, విదేశాల సహకారమే పరమావదిగా, మేక్-ఇన్-ఇండియా ని నిర్లక్ష్యం చేస్తూ నిర్మించబడుతున్న అమరావతి వలన మరో విభజన కు అంధ్రప్రదెశ్ సిద్దమవ్వాలా? సమైక్య అంద్రప్రదేశ్ విడిపోవటానికి అభివృద్ది కేంద్రీకరణే కారణమే అని తెలిసినా అదే తప్పు మరల చేస్తుంటే అది ఖచ్చితంగా జాతిని మోసం చేసే ప్రణాళికే అవుతుందంటారు ప్రజలు. కాబట్టి ‘అవినీతిలో కూరుకున్న అసమర్ధ ప్రతిపక్ష నాయకుని పదే పదే వేలెత్తి చూపుతూ’ ప్రజలకు తమ సత్యసందత నిరూపించవలసిన అంశం నుండి తప్పించు కున్నత మాత్రాన ప్రభుత్వం నిజాయతీని ప్రజలు శంకించ కుండా ఉండరు.

9. ఏపి లో సెక్సు, కాల్-మని, ఇసుక, కల్తీ, మద్యం మాఫియా ల దందా నిరంతరాయం గా నడుస్తుండటం అంధ్రులకు సర్వత్రా అగౌరవమే జరుగుతుంది.


10. మంత్రుల కొడుకులు కార్ ప్రమాదాలు నిర్దాక్షిణ్యంగా చేసి అమాయకులని చంపేసినా విచారణ జరిపించని ప్రభుత్వమునకు గౌరవం మిగలదు.


11. ఒక మంత్రి కొడుకు తెలంగాణాలో ఒక స్త్రీ ని కిడ్నాప్ చేసినప్పుడు కేసు నమోదైంది. అప్పుడు ప్రజలు ఇదే అంద్ర ప్రదెస్ లో అయితే ఈ మంత్రి కొడుకు పై కేసు నమోదయ్యెది కాదు అని తెలుగుజాతి నిర్దారించారు. ఇదీ ఏపి ప్రతిష్ట. అమరావతికి అప్రతిష్ట.


12. ఎన్నికలప్పుడు అనేక కులాలకు ఇచ్చిన వాగ్ధానలను చట్టం పేరు చెప్పి ఇప్పుడు తప్పించు కున్నారు. కాపులను బి.సి లలో చేరుస్తామన్న ఎలక్షన్ వాగ్దానం మాత్రమే కాకుండా ముద్రగడ నిరాహారదీక్ష విరమించినప్పుడు చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి, ముద్రగడ వైయెసార్సిపి మనిషని ముద్రవేయటం అసలే ఒక కులాధిపత్యమున్న నగరం కులపోరాటాల నగర మయ్యే అవకాశం ఉంది. అదేజరిగితే అమరావతికే అప్రతిష్ట.


13. ఓటు కు నోటు కేసు లో బహిరంగంగా బుక్ అయిన చంద్రబాబు & టి-టిడిపి నిజస్వరూపం తెలుగుజాతికేకాక భారతజాతికి కూడా తెలుసు. తెలంగాణా ఏసిబి బాబు పార్టి బట్టలూడదీసినా ఇంకా తానే నీతి-నిప్పు అనే బాబుకు & టి-టిడిపికి తెలంగాణాలో అంత్యక్రియలు జరిగినా ఇంకా సిగ్గు లేకుండా న్యాయస్థానాలను ఎదుర్కుంటున్న జగన్ కంటే ఏవిధంగా గొప్పవాడు. జగన్ పై విరుచుకు పడటం సిబిన్ విజ్ఞతకే వదిలివెయ్యాలి. ఈ రోజు జగన్ పట్ల శాసనసభలో ప్రభుత్వ పశుబలంతో విర్రవీగిన తీరును జాతిగమనిస్తూనే ఉంది. సభాపతి ప్రవర్తన కూడా సభ్యసమాజం హర్షించదు. జగన్ ను నమ్మలేని జనం విధిలేని పరిస్థితిలో సిబిఎన్ మంచిపాలన ఇవ్వగలడనుకుంటే అమరావతిలో పాలన అగమ్యగోచరంగా తయారైంది. జగన్ కు జనంలో సానుభూతి పెరుగుతుందన్నది బాబు తెలుసుకోలేక పోతున్నాడు. దురదృష్టవంతులైన అంధ్రులకు మరల జగన్ పాలనవస్తుందా? అయితే దానికి ఏపి అసెంబ్లి లో జరిగిన కౌరవసభ కంపించింది. దుర్యొధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఒక్కసారిగా కనిపించారు ఈ అమరావతి అనే కౌరవసభలో.

అమరావతి



14. అమరావతి మాతృభాష ఏమిటి బాబూ? అంటే ఇంగ్లిష్ అంటాడు యనమల. ఏపి రాష్ట్ర బడ్జెట్ ను తెలుగులో సుమారు రెండు గంటలు ప్రవచించారు ఈ ఘరానా ఆర్ధికామాత్యులు. తెలుగుజాతికి గర్వంగా చెప్పుకొనే అమరావతి అధికార భాష ఇంగ్లిష్ అని చెప్పకనే చెప్పారు. అంటే అమరావతి రాజధానిగా ఉన్న ఆ ప్రాంత ప్రజలకు ఈ విశ్వనగరం నివాసంగా ఉండదని అర్ధమౌతుంది. విదేశీయులకు నెలవు ఔతుంది. ఇక ఇక్కడ ప్రతిదీ విదేశమే ఔతుంది. కేంద్రంలో ఉన్న మిత్రపక్షం బిజెపి మాత్రం మేక్ ఇన్ ఇండియా ను ఉద్యమం గా నడిపిస్తుంది.


అమరావతి అమరావతి బాబు జనుల మాహిష్మతి కులదూలకు పరాకాష్ట ఈ నూతన సింగపురి (సింగపూర్) !!


ఆంధ్రజనుల కలలపంట ఈ అమరావతి నగరమంట సీమజనుల గ్రహచారమంట ఈ అధునాతన సింగపురి !!


నిరుపేదల పొట్టకొట్టి సంపన్నుల జేబునింపు యమగిరి ఈ అమరపురి ప్రజాస్వామ్య పతనానికి సాక్ష్యమిచ్చే చరిత్రగతి ఈ మాహిష్మతి !!


తరతరాల అంతరాల ప్రాంత వర్గ భేదానికి రూపవతి ఈ ఇంద్రపురి కలగమన పర్వంలో సీమజనుల క్రోదానికి ఆజ్యమిచ్చు ఆతిద్యపురి !! 


జనాగ్రహ జ్వాలల పధకరచనా పథంకదిలే విచిత్రపురి అమరావతి ప్రకృతి పులకింతలేని ప్రయత్నమే ఈ అమరపురి !! 


కృష్ణవేణి సృజించనున్న దుర్గతల్లి ముక్కుపుడక ప్రజ్వరిల్లె తరుణమిది నరహంతక తత్వవంతో చిరుజీవుల ఉనికిలేని హననపురి ఈ నారాపురి !! అమరావతి అమరావతి బాబుజనుల మాహిష్మతి కులదూలకు పరాకాష్ట ఈ నూతన సింగపురి !!


మరింత సమాచారం తెలుసుకోండి: