బాహుబలి.. తెలుగు సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసలు అందుకున్న సినిమా.. ఈ సినిమాపై ప్రశంసలు ఎన్నో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. విమర్శల సంగతి ఎలా ఉన్నా.. తెలుగు సినిమా కలెక్షన్ స్థాయిని ఓ రేంజ్ కు పెంచిన సినిమాగా బాహుబలి చరిత్రలో చోటు చేసుకుంటుంది. అలాదే జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమాగా కూడా బాహుబలి సంచలనం సృష్టించింది. 

అయితే తాజాగా ఈ సినిమా పై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.  సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానెల్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. రాజమౌలితో సినిమా చేస్తారా అన్న ప్రశ్నపై పవన్ ఆసక్తికరంగా స్పందించారు.

తాను ఇంతవరకూ బాహుబలి సినిమా చూడలేదంటూ షాక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. కొందరితో సినిమాలు తీయాలంటే ప్లాన్‌తో జరగదు. అది అనుకోకుండా జరగాల్సిందే' అంటూ కొంత సస్పెన్స్ కియేట్ చేశారు. అయితే బాహుబలి వంటి సినిమాను చూడలేదని చెప్పడం కాంట్రావర్సీ అవుతుందనుకున్నారో.. లేక ఏ ఉద్దేశంతో అన్నారో కానీ.. పవన్ ఇంకో కామెంట్ కూడా చేశారు. 

నేను కొన్ని నా సినిమాలు కూడా ఇప్పటివరకూ చూడలేదు అంటూ కామెంట్ చేశారు పవన్. మొత్తానికి బాహుబలిపై పవన్ నుంచి ఒపీనియన్ రాబట్టాలన్న జర్నలిస్ట్ కోరిక మాత్రం నెరవేరలేదు. ఇక ఇంటర్వ్యూలో మిగిలిన విషయాల విషయానికి వస్తే.. 'దేశంలో చాలా సమస్యలుండగా రోహిత్ వేముల ఆత్మహత్యనే రాజకీయపార్టీలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయో అర్థం కావడంలేదు. అది విద్యార్థుల సమస్య మాత్రమే' అని కామెంట్ చేశారు పవన్. 

అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలపై స్పందించిన పవన్ 'అసహనం అనే మాటని జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు. అన్నింటికన్నా ప్రకటన చేసి పారిపోవడం సమంజసం కాదు' అని బదులిచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: