తిరుమల వెంకటేశ్వరుడు అంటే తెలుగు వారే కాదు.. భారత దేశమంతటి నుంచీ భక్తులు ప్రవాహంలా వస్తుంటారు. రోజుకు కనీసం 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్సించుకుంటారు. తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీనివాసుని దర్శించుకోవడమంటే అదో అనిర్వచనీయ అనుభూతి. అందుకే శ్రీవారికి భక్తితో కానుకల సమర్పించుకుంటారు. 

తిరుమలలో కొలువైన శ్రీవారు..


కానీ ఇలా భక్తులు భక్తితో సమర్పించుకునే కానుకలను సరిగ్గా సేకరించే తీరిక కూడా టీటీడీ సిబ్బందికి లేనట్టు కనిపిస్తోంది. తాజాగా తిరుమల నారాయణగిరి వెలసిన శ్రీవారి పాదాల చెంత భక్తులు కానుకల సమర్పించడంలో సమస్య తలెత్తింది. అక్కడ హుండీ నిండిపోయినా సంబంధిత సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు భక్తులే హుండీపై ప్లాస్టిక్‌ ట్రేను ఉంచారు. 

తిరుమలలో భక్తుల బారులు..


భక్తులు సమర్పించుకునే కానుకలను ఆ ట్రేలో వేస్తున్నారు. హుండీని వెంటనే ఖాళీ చేయించే విషయంలో శ్రీవారి ఆలయం, నిఘా భద్రతా సిబ్బంది తీవ్రంగా నిర్లక్షం చూపారు. నిత్యం శ్రీవారి పాదాలను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానుకలను కూడా భారీగా సమర్పిస్తుంటారు. హుండీ నిండిపోయి ట్రేలో డబ్బులు వేసే వ్యవహారంపై యాత్రికుల నుంచి విమర్శలు వినిపించాయి.

నిండిపోయిన హుండీ.. పట్టించుకునే వారేరీ..?




మరింత సమాచారం తెలుసుకోండి: