తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం మరింత వేడి రాజుకుంటుంది. ప్రతిరోజు అక్కడ ఎదో ఒక సంచలనం జరుగుతూనే ఉంది. జంపింగ్ లు, బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరోవైపు పొత్తులు, రెబల్స్ తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో జయలలిత,విజయ్ కాంత్,కరుణానిధి, వైగో లాంటి వారే కనిపిస్తున్నారు. అంతే కాదు ఈ సారి ముఖ్యమంత్రి పదవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ పావులు కదుపుతున్నారు. అంతే కాదు మొన్నటి వరకు పార్టీల పరంగా కొనసాగిన యుద్దం ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి..అంతే కాదు ప్రత్యర్థుల విషయాల్లో దాడులు కూడా జరుగుతున్నాయి.

విలేకరిపై సీరియస్ అవుతున్న దృశ్యం



తాజాగా డీఎండీకే అధినేత, తమిళ హీరో విజయ్‌కాంత్ ఈసారి ఏకంగా తను నియమించుకున్న బౌన్సర్‌నే కొట్టారు. అదికూడా మామూలుగా కాదు నాలుక మడతపెట్టి మరీ సీరియస్ గా మోచేయితో ముఖంపై గుద్దుకుంటూ వెళ్లాడు. అసలు విషయం ఏంటంటే నామినేషన్ల క్రమంలో, అభ్యర్థుల ఎంపిక కోసం సేలం వెళ్లిన విజయ్ కాంత్ కారు దిగగానే జర్నలిస్టులు చుట్టుముట్టారు. వారిని సముదాయించుకుంటూ పక్కకు జరగాలంటూ సైగ చేస్తూ ముందుకు కదిలారు కానీ ఓ జర్నలిస్టు తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో  చిర్రెత్తుకొచ్చి అతడి చెంప వాయించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.


బౌన్సర్ పై సీరియస్ అవుతున్న విజయ్ కాంత్


తర్వాత కోపంగా మెట్లెక్కతూన్న విజయ్ కాంత్ ని అనుసరిస్తున్న అతని బౌన్సర్ ని కోపంగా మోచేత్తో పొడుస్తూ పైకి వెళ్లాడు. మరోవైపు డీఎండీకే పార్టీ కార్యాలయంపై కొద్దిసేపటి క్రితం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, కొంత ఫర్నీచర్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తమ ఆఫీసుపై కొందరు ఆందోళనకారులు దాడికి దిగారని డీఎండీకే కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: