మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో చెప్పుకోదగ్గ ప్రభావం చూపించాలని భావిస్తున్న  బీజేపీ వ్యూహాత్మక అడుగు వేసింది. ప్రముఖ మలయాళ సినీ నటుడు సురేష్ గోపీని కేంద్రం రాజ్యసభకు నామినేట్  చేసింది. కళాకారుల కోటాలో సురేష్  గోపీ పేరును కేంద్రం ప్రకటించింది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ప్రకటించిన సురేష్  గోపీ....ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్  షాతో భేటీ అయ్యారు. కేరళలో సినీ నటుల కోటాలో తొలిసారిగా రాజ్యసభ పదవి చేపట్టనున్న తాను రాష్ట్ర అభివృద్ధి విషయంలో బాధ్యతగా పని చేస్తానని తెలిపారు.

మలయాళ సినీనటుడు సురేష్‌ గోపీ రాజ్యసభ సీటుకు నామినేషన్‌ వేశారు. బీజేపీ మద్దతుతో పెద్దసభకు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న ఆయన… నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. దక్షిణాదిలో పట్టు పెంచుకోడానికి సినీ స్టార్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే రాజ్యసభ సీటు విషయంలో సురేష్‌ గోపీకి మద్దతిస్తున్నట్టు సమాచారం.

అమిత్ షాతో భేటీ అయిన సురేష్ గోపీ..


తనకు అవకాశం కల్పించడంపై సురేష్ గోపీ పుల్ ఖుషీ అయ్యారు. రాజ్యసభ సభ్యత్వం రావడం చాలా పెద్ద బాధ్యత.. కేరళకు చెందిన ఓ సినీ నటుడికి రాజ్యసభ అవకాశం రావడం ఇదే మొదటి సారి... బాధ్యతలును నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే తనకు ఈ అవకాశం వచ్చిందని అమిత్ షాను కలసిన ఆయన చెప్పుకొచ్చారు.

మలయాళంలో సీనియర్ నటుల్లో ఒక్కరైన సురేష్ గోపి.. దక్షిణాది సినిమాల్లో తరచూ కనిపిస్తుంటారు. ఇటీవలే జావెద్ అక్తర్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో సురేష్ గోపిని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. సురేష్ గోపి రాజ్యసభకు నామినేట్ అవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: