కొన్ని సినిమాల్లో చనిపోయాడనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా జీవించి వస్తాడు..దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటివి సినిమాల్లో అయితే కాస్త థ్రిల్, ఎంట్రటైన్ మెంట్ గా ఉంటుంది..కానీ నిజజీవితంలో జరిగితే..దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇలాంటి ఉదంతమే మద్రాస్ హైకోర్టు లో జరిగింది. వివరాల్లోకి వెళితే..తమిళనాడు ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిలో 2011లో కృష్ణన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.  కృష్ణన్ హత్యకేసులో బాలు, రాము ప్రధాన నింధితులుగా పరిగనించి  పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. అంతే కాదు  కృష్ణన్ చనిపోయినట్లుగా పంచాయతీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేసింది. దీన్ని పోలీసులు కోర్టుకు అందజేశారు.



ఇది జరిగిన కొన్ని రోజుల్లో గోవింద స్వామి అనే వ్యక్తి హత్య గావింపబడ్డాడు..దీనికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌ను పోలీసులు దాఖలు చేశారు..ట్విస్ట్ ఏంటంటే ఈ హత్యకు కృష్ణన్ సాక్షిగా చేర్చారు. ఇకపోతే కృష్ణన్ హత్యకేసులో నిందితులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు జనవరిలో తీర్పు చెప్పింది. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుల తరుపు లాయర్  మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.  దీన్ని న్యాయమూర్తులు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. నిందితుల తరపున హాజరైన న్యాయవాది రవిచంద్రన్ మాత్రం హత్యకు గురైనట్లుగా భావిస్తున్న కృష్ణన్ బతికే ఉన్నాడని, పోలీసులే ఈ కేసును తప్పుదోవ పట్టించారని చెప్పారు.


కృష్ణన్ బతికి ఉన్నట్లయితే కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయమూర్తులు కోరారు. ఈ సమయంలో కృష్ణన్ హాజరైనట్లు లాయర్ పేర్కొనగా ప్రభుత్వ న్యాయవాది మహారాజా మధ్యలో అడ్డుకుని కోర్టుకు వచ్చిన వ్యక్తి కృష్ణన్‌ కాదనీ, గోవిందస్వామి అని, అతనిపై ఆంధ్రప్రదేశ్‌లో అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వాదించారు. దీంతో బిత్తరపోయిన న్యాయమూర్తులు, కోర్టుకు హాజరైన వ్యక్తి ఎవరు, హతులు ఎవరు, ఆత్మహత్య చేసుకున్నవారు ఎవరో తేల్చేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి పోలీసు అధికారితో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: