ప్రపంచంలో ప్రతి మనిషీ తాను చాలా అందంగా ఉండాలని కోరకుంటారు. అంతే కాదు ఎప్పటికీ వయసు బయట పడకుండా నిత్యయవ్వనంగా ఉండాలని ఫిట్ నెస్ మంత్రం జపిస్తుంటారు. కొంత మంది యోగా, జిమ్ చేస్తూ తమ యవ్వనాన్ని కాపాడుకుంటారు..ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పొల్యూషన్ ని మన వయస్సు రోజు రోజు కీ తగ్గిపోతుందనే చెప్పవచ్చు. నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి శుభవార్త..! వృద్ధాప్యాన్ని తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు కొల్లాజిన్ కలిసిన మద్యపానీయాన్నిప్రపంచంలోనే మొట్ట మొదటిసారి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. యాంటే ఏ జిన్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది.

 సౌందర్యం కోసం పరితపించే వారికి ఈ నూతన మద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తయారీదారులు చెప్తున్నారు.  బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ కంపెనీ 'యాంటే ఏ జిన్'  నూతన మద్యాన్ని ఆవిష్కరించింది. యవ్వన వయసులో ముఖం పై వచ్చే ముడుతలు..కళ్లపై ఉండే మచ్చలు..దాదాపు చిన్న వయసులోనే పెద్దవయసు వారిలా కనిపించే వారికి ఇది అమృతం వంటిది అంటున్నారు కంపేనీవారు.  ఈ సౌందర్యసాధనం ఒక బాటిల్ ఖరీదు సుమారు 35 పౌండ్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు.  

మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ కొల్లాజిన్ గుళికలకు బదులుగా ఈ కొత్తరకం మద్యం తీసుకొని సౌందర్యాన్ని పెంచుకోవచ్చని, యవ్వనాన్ని నిలుపుకోవచ్చని వెల్లడించారు. దీని తయారీలో మంచి విటమిన్లతో పాటు  40శాతం ఛమోమైల్, టీ సువాసనలతో కలసిన స్పిరిట్ ఉంటుందని తెలిపారు.

అంతేకాక ఇతర రంగులతోపాటు దురదగొండి, కొత్తిమీర, జునిపెర్ వంటి సుగంధ మొక్కల వేళ్ళను కూడ ఈ పానీయం తయారీలో వినియోగించారు. ఈ జిన్ సేవించిన వారు మంచి యవ్వనం పొందవొచ్చని  వార్నర్ లీజర్ హోటల్స్ తమ వెబ్ సైట్ లో వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: