అదేంటి  ఫేస్ బుక్, గూగుల్, సిస్కో కార్యాలయాలు సముద్రంలో మునిగిపోవడం ఏంటని అవాక్కవుతున్నారా...? అవును మీరు చదువుతున్నది పచ్చి నిజం. భవిష్యత్తులో ఫేస్ బుక్, గూగుల్, సిస్కో లాంటి ప్రధాన కార్యాలయాలన్నీ సముద్రంలో కలిసిపోనున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరాన్ని ఆనుకుని ఫేస్ బుక్, గూగుల్, సిస్కో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

 

అయితే పెరుగుతున్న సముద్రమట్టంతో ఇవి మునిగిపోయే ప్రమాదం ఉందని ఓ శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు కార్బన్ వ్యర్థాలు, కాలుష్యమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ముఖ్యంగా ఫేస్ బుక్ కార్యాలయానికి ముప్పు ఎక్కువగా ఉందని ఈ టీమ్ చెబుతుంది. చాలా లోతట్టు ప్రాంతంలో ఫేస్ బుక్ కార్యాలయం ఉందని అంటున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ వాయువులను విడుదలను కట్టడి చేసినా.. ఈ కంపెనీల కార్యాలయాలు ఇతర ప్రపంచంతో సంబంధాలు తెంచుకునే ముప్పు మాత్రం తగ్గదని.. అప్పుడు సదరు సంస్థలు మూత పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

 

అలానే సాగర తీరంలో ఉన్న 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య, నివాస ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అయితే, దీనికి కొంత కాలం సమయం పడుతుందని, అమెరికా రాష్ట్రానికి సునామీ వచ్చినప్పుడు ఈ కార్యాలయాలన్నీ ప్రమాదం భారిన  పడతాయని శాస్త్రవేత్తల అంచనా. యుగాంతం ముంచుకొచ్చినప్పుడు ఈ ప్రమాదాలు ఎలాగో తప్పవు....!


మరింత సమాచారం తెలుసుకోండి: