మినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ సమీపిస్తుండటంతో ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. టికెట్లు దక్కిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. ఆశావహుల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పోటీ నుంచి తప్పుకున్నారు. కారణాలు ఏవైనా ఆయన ఇక రాజకీయాలు దూరంగా ఉండనున్నారని, కేవలం క్రియాశీల రాజకీయాలకు పరిమితం కానున్నారని సమాచారం. ఇంక ఎన్నికలు దగ్గారపడే కొద్ది ఎందరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారో అని రాజకీయ నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగో ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి కేజే శరవణన్ స్పందిస్తూ వైగోపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. అందుకే పోటీ నుంచి ఆయన తప్పుకున్నారని తెలిపారు. కాగా, 1994 నుంచి డీఎంకే నుంచి తప్పుకున్న వైగో.. ఎండీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే. అలాగే, 2002లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైగోను పోటా చట్టం కింద అరెస్టు చేశారు. 

 

ఈనెల 29వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో ఈ వారంలోనే వైగో తన నామినేషన్‌ దాఖలు చేస్తారని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే అనూహ్యంగా ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆయన పోటీ చేయాలనుకున్న కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి రమేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: