ఇప్పటివరకూ ఎన్నో విలాసవంతమైన కార్ల గురించి విన్నాం.. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ కారు మాత్రం వెరీ వెరీ స్పెషల్. లుక్కులోనూ, సౌకర్యాల్లానూ దీనికి సాటి వచ్చే కారు చాలా అరుదు. చెప్పడానికి కారే అయినా  మినీ వ్యానులా, మరో కోణంలో చిన్నపాటి విమానంలా కనిపించడం దీని ప్రత్యేకత. ఇంతకూ దీని యజమాని ఎవరో చెప్పలేదు కదూ.. 

ఆయనే దేశంలోకెల్లా ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. ఇటీవల ఆయన ముచ్చటపడి కొనుక్కున్న కొత్త కారు.. ముంబై సెలబ్రెటీ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యిందట. ఎందుకంటే ఆ కారు దాదాపు పాతిక కోట్ల రూపాయలట. కేవలం ఆ కారు మీద ముకేశ్ అంబానీ కట్టిన పన్నే దాదాపు2 కోట్ల రూపాయలు ఉంటుందట. 

విలాసవంతమైన లోపలి భాగం.. 


ఇక ఈ కారులో ఉన్న సౌకర్యాల గురించి చెప్పుకుంటూపోతే అదో మినీ మహాభారతమే అవుతుందట. సౌకర్యాల పరంగా చూసినా, సెక్యూరిటీ పరంగా చూసిన ఇది హైఎండ్ అంటున్నారు. పేరుకు కారే అయినా దీన్నిఓ చిన్నపాటి ఇల్లుగానే చెప్పుకోవచ్చట. ఇందులోనే ఓ లివింగ్ రూమ్, ఓ బెడ్రూమ్ కూడా ఉన్నాయట. 

కారులోపలి బెడ్ రూమ్.. 


ఇక ఈ కారులో ఏసీ ఆన్ చేస్తే జస్ట్ 20 సెకన్లలో మొత్తం కారంతా చల్లగా అయిపోతుందట. ముకేశ్ అంబానీ వంటి దిగ్గజాల సమయం ఒక్కో సెకనూ కొన్ని కోట్లతో సమానం కదా..అందుకే ఆయన ప్రయాణ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు ఈ కారులో ఉన్నాయట. అన్నిఅనుమతులూ తీసుకున్న ఈ కారు త్వరలోనే ముంబై రోడ్లపై చెక్కర్లు కొట్టబోతోందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: