ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. కానీ సరైన స్టోరేజ్, కెమేరా క్వాలిటీ, హైకెపాసిటీ ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం పది వేల రూపాయలు చేతిలో ఉండాల్సిందే. కానీ ఇప్పుడో చైనా కంపెనీ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చింది. అతి తక్కువ ధరలో కొనుగోలుదారులను ఊరిస్తోంది.  

అదిరే లుక్కు.. 


ప్రముఖ మొబైల్ సంస్థ మైజు ఎం3 స్మార్ట్‌ ఫోన్‌ని చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.  16 జీబీ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర సుమారుగా రూ.6000. అదే  32జీబీ కెపాసిటీ ఉన్న ధర సుమారు రూ.8,200. మరింకేం బుక్ చేద్దామనుకుంటున్నారా.. కాస్త ఆగండి. ఈ ఫోన్ ప్రస్తుతం  చైనామార్కెట్లోకి మాత్రమే వస్తోంది. 

హై ఎండ్ ఫీచర్స్..



ఈనెల 29 నుంచి చైనా మార్కెట్లో రిలీజవుతోంది. త్వరలోనే ఇతర దేశాల్లోనూ అందుబాటులో ఉంచుతామంటోంది మైజు సంస్థ. ఇక ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు పరిశీలిస్తే.. స్క్రీన్ 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే. ప్రాసెసర్ ఆక్టాకోర్‌. మొమొరీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చట. 

ఊరిస్తున్న మైజు ఎం త్రీ..


కెమేరా విషయానికి వస్తే.. రేర్ కెమేరా 13 మెగాపిక్సెల్‌, ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సెల్‌. బ్యాటరీ కెపాసిటీ  2870 ఎంఏహెచ్‌. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో ఈ ఫోన్ పనిచేస్తుంది.  డ్యూయల్‌ సిమ్‌ ఫెసిలిటీ ఉన్న ఈ ఫోన్ 4జీ కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఇన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్.. 6 వేల రూపాయలకే చేత చిక్కుతుందంటే సంతోషమే కదా. అందుకే ఈ సంస్థ వెబ్ సైట్ పై ఓ కన్నేయండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: