వైసీపీకు సీనియర్ నేత మైసూరా రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న వైసీపీకి ఇది మరో దెబ్బేగానే భావించాల్సి ఉంటుంది. అందులోనూ పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలో సీనియర్ నేత మైసూరారెడ్డి జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.. 

జగన్ ది ఒంటెత్తుపోకడ అని మైసూరా రెడ్డి విమర్శించారు. జగన్ ఎవరి సలహాలూ తీసుకోరని మైసూరా అంటున్నారు. అంతేకాదు.. జగన్ వ్యవహారం అపరిచితుడు సినిమా తరహాలో హీరో తరహాలో నిలకడ లేని తనం ప్రదర్శిస్తుంటాడని మైసూరా విమర్శించారు. జగన్ కు ఎంతసేపూ అధికారపీఠంపై యావ తప్ప.. అతనిలో మానవీయ కోణంలేదని విమర్శించారు. 

జగన్ పై పదునైన విమర్శలు..


ఇక తన అవసరం లేదని భావిస్తున్న పార్టీలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే.. రాజీనామా చేయడమే బెటర్ అని భావిస్తున్నానని మైసూరారెడ్డి చెప్పారు. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే మాటకు తావు లేదని మైసూరా చెప్పారు. జగన్ కు అధికారపీఠంపై కోరిక తప్ప ప్రజా సమస్యలపై పోరాడాలన్న చిత్తశుద్ధి లేదని మైసూరా చెప్పారు.

తన ఫ్యూచర్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని.. అందుకు తొందరేమీ లేదని మైసూరారెడ్డి చెప్పారు. అనేక విషయాలపై మైసూరారెడ్డి సమాధానాలు దాట వేశారు. జగన్ నుంచి స్పందన వచ్చిన తర్వాత మరింత మాట్లాడతానని మైసూరా చెప్పారు. ఇక్కడే ఉంటా కదా.. ఎందుకు తొందర.. ఎక్కడికీ పారిపోను అంటూ విలేఖరులతో సరదాగా కామెంట్ చేశారు. పార్టీలో తన చేరికే అనుకోకుండా జరిగిపోయిందని మైసూరా చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: