ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ మద్యం మత్తులో ఒక ముస్లీం మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు మీడియా లో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే దీనిపై స్పందించిన మంత్రి అప్పుడు మీడియా ముందు నా కొడుకును నేనే స్వయంగా పోలీస్ లకు అప్పగిస్తానని ప్రగల్భాలు పలికిన మాట గూడా మనకు గుర్తు ఉండే ఉంటుంది. అయితే నీటి రాజకీయ నాయకులు ముందు ఒకమాట వెనక ఒక మాట మాట్లాడుతారనే విషయం ఈ మంత్రిగారిని చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

 

స్వయంగా తన కొడుకుని కటకటాల్లోకి వేస్తా అని మీడియా ముందు చెప్పిన ఆయన వెనక మాత్రం డబ్బు ఆశ చూపి ఆయన కొడుకుని ఆ కేసు నుండి బయటపడేసుకున్నారు. ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబుకు ఈ కేసులో  ఊరట లభించింది. ఆయ‌న కొడుకు తాగి, దారిన వెళ్లే ఒక మహిళ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈకేసులో మంత్రి కొడుకుతోపాటు డ్రైవర్ కూడా రిమాండ్ లో ఉన్న విష‌యం తెలిసిందే! జైలుకు వెళ్లి బెయిల్ పై కూడా వచ్చారు. ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు కూడా రావెలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి పదవిలో ఉండి ఇలాంటి పనులు చేస్తే సర్కారుకు చెడ్డ పేరొస్తుందని గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ట‌. ఇక ఈ కేసు తెలంగాణ పోలీసుల చేతిలో ఉండటంతో ఆయన ఒత్తిడి తెచ్చి తక్కువ తీవ్రత గల సెక్షన్ లు పెట్టించుకున్నారు. అసలే తన మంత్రి పదవి ఊడుతుందన్న ప్రచారం ఒక‌పక్క జోరుగా జ‌రుగుతోంది.

 

ఈస‌మ‌యంలో కొడుకు వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డంతో వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు రావెల‌. అందుకే ఆ మహిళ‌తో రాజీ చేసుకున్నారని ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఆమెకు భారీగా డబ్బులిచ్చి..త‌న ప‌ట్ల మంత్రి త‌న‌యుడు తప్పుగా ప్రవర్తించలేదని అఫిడవిట్ రాయించుకున్నారట. దీని ప్రకారంగానే రావెల కొడుకు తప్పు చేయలేదని కోర్టు కేసు కొట్టేసిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇక మీడియా ముందు అతను తప్పుగా ప్రవర్తించాడు, చేయి పట్టుకున్నాడని ఒకప్పుడు చెప్పిన ఆమె ఇప్పుడు ఇలా మాటమారుస్తుందనేది కొందరి వాదన. ఏదిఏమ‌యినా కోర్టు కేసు కొట్టేయ‌డంతో రావెల‌కు స‌న్‌స్ట్రోక్ తప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: