ఏపీ ప్రతిపక్షనేత జగన్ హస్తిన యాత్రలో ఉన్నారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయమైందని డిల్లీలో ప్రచారం చేస్తున్నారు. కనపడిన జాతీయ నేతలకు ఈ విషయం మొరపెట్టుకుంటున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలోపడిందని చెబుతున్నారు. రాజ్ నాథ్ సింగ్,అరుణ్ జైట్లీ వంటి కేంద్రమంత్రులనే కాకుండా వివిధ జాతీయ పార్టీల నాయకులనూ కలుస్తున్నారు. 

ఐతే.. జగన్ ఢిల్లీ టూర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలన్నారు.  తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒక్క మచ్చ కూడా పడలేదని చెప్పుకొచ్చారు. నీతిగా నిజాయితీగా గడిపా.. అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా.. నాపై పదుల కొద్దీ విచారణలు వేశారు. కోర్టులకు వెళ్లారు. కానీ ఏ ఒక్కటీ రుజువు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మచ్చలేని రాజకీయ జీవితం నాది: మరి ఓటుకు నోటు సంగతేంటి..!?


జగన్ దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మరని చంద్రబాబు అంటున్నారు. లక్షా 30 వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న జగన్.. తనకు దిక్కున్నచోట చెప్పుకోవచ్చని హేళన చేశారు చంద్రబాబు. చంద్రబాబు కామెంట్లు భలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.  ఆయన మచ్చలేని నాయకుడిని అని గొంతెత్తి నినదిస్తున్న సమయంలో అనుకోకుండా ఎందుకో ఓటుకు నోటు కేసు గుర్తుకొస్తోంది.

నాపై ఒక్క కేసు కూడా రుజువు కాలేదు అన్నప్పుడు .. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో టేపు చెవుల్లో మారుమోగుతోంది. అకస్మాత్తుగా కేసీఆర్ తో రాజీకు వచ్చిన వైనం, సెక్షన్ 8 పై పోరాటం అటకెక్కిన వైనం.. ఉన్నపళంగా హైదరబాద్ నుంచి పాలన బెజవాడ బాట పట్టిన వైనం అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏదేమైనా జనాని జ్ఞాపకశక్తి తక్కువ అని చంద్రబాబుకు మంచి నమ్మకం ఉండి ఉండాలి. లేదా జనం వెర్రితనంపై ప్రగాఢమైన విశ్వాసమైనా ఉండి ఉండాలి. ఏమంటారు..!?


మరింత సమాచారం తెలుసుకోండి: