ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దూసుకుపోతోందా.. వరుసగా ప్రముఖ కంపెనీలు తమ సంస్థల ఏర్పాటు కోసం ఏపీ వైపు చూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల రాకతో ఏపీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోతుందా.. అవునంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన ఢంకా భజాయిస్తున్నారు. 

దేశంలో ఏ రాష్ట్రానికి లేని సౌకర్యాలు, సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కలుగజేస్తుందని చంద్రబాబు అంటున్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఇసుజు వాహన కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భారతదేశంలోని జపాన్ రాయబారి కెన్జీ హీరా మజ్జు, జపాన్ ఇసుజు ప్రెసిడెంట్ మసనోరి కటయామలు పాల్గొన్నారు. 

పరిశ్రమల నెలవుగా శ్రీసిటీ..!



శ్రీసిటీలో ఇసుజు కంపెనీ 107 ఎకరాల విస్తీర్ణంలో మూడు వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించారు. సాధారణ వాహనాల నుంచి అన్ని రకాల వాహనాలు ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలోనే హీరో మోటార్స్ సంస్ధను శ్రీసిటీలో శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇదే శ్రీ సిటీలో క్యాడ్బరీస్ పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. 

కారు నడిపిన చంద్రబాబు.. 



పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ అత్యుత్తమమైన ప్రాంతమని పేర్కొన్నారు. శ్రీసిటీలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. సామర్ధ్యం ఉన్న యువతకు కోదవ లేదని.. నైపుణ్యాభివృద్ది సాధిస్తే అత్యుత్తమ స్ధాయికి ఎదుగుతారని తెలిపారు. ఇసుజు ప్లాంట్ ను ఆయన పరిశీలించి అక్కడి ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఆయన ఇసుజు ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కొద్దిసేపు కారు నడిపి అందర్నీఆశ్చర్యపరిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: