ఏపీ సర్కారు అవినీతి మయమైందని ప్రతిపక్షనేత జగన్ ఆరోపిస్తున్నారు. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల అక్రమాల చిట్టా అంటూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో ఓ పుస్తకం ముద్రింపు డిల్లీ గల్లీల్లో పాంప్లెట్లలా పంచిపెడుతున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే.. అదో ప్రపంచస్థాయి స్కామ్ అని జగన్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. 

జగన్ డిల్లీ ప్రచారం ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో క్రమంగా మొదలైంది. అందుకే ఒక్కొక్కరుగా జగన్ పై విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. వాదనతో జగన్ ప్రచారం తప్పని నిరూపించేందుకు ప్రయత్నించేవారు కొందరైతే.. అడ్డగోలుగా శాపనార్థాలతో, వెక్కిరింతలు, తిట్లతో బదులిచ్చేవారు మరికొందరు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఈ రెండో కేటగిరీలోకి వస్తారు. 

జగన్ కు వైద్యులకే అంతుబట్టని రోగం వచ్చిందట 

 
జగన్ కు పిచ్చి ముదరిందని.. ఆయనకు వచ్చిన జబ్బుకు ఏమందు వాడాలో మానసిక వైద్యులకు కూడా అర్ధం కావడం లేదని మంత్రి దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల అవినీతిపై రాజా ఆఫ్ కరెప్షన్ పేరిట ఆధారాలతో సహా తాము తీసుకొచ్చిన పుస్తకంపై సీబీఐ విచారణ జరిపితే 13 కేసుల్లో ఏ1ముద్దాయిగా జగన్ తేలాడని ఆయన  గుర్తుచేశారు. 

తాను చేసిన అవినీతిపై జైలు శిక్ష కూడా అనుభవించిన ఆ దొంగే... ఇప్పుడు దొంగా.. దొంగా అంటూ అరుస్తున్నాడని దేవినేని అంటున్నారు. తమపై బురదచల్లాలనే ఆత్రుతతో ఆకాశంపై ఉమ్మేసే ప్రయత్నాలు జగన్ చేస్తున్నాడని ఆక్షేపించారు. మంత్రులు తప్పు చేస్తే బర్తరఫ్ చేస్తానని ఆధారాలు ఇవ్వమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో సవాలు చేస్తే వెన్నుచూపి పారిపోయిన జగన్ ఇప్పుడు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: