వైసీపీ నుంచి మైసూరా రెడ్డి బయటకు వచ్చేశారు. కాస్త సీనియర్ నేత కాబట్టి మీడియా కూడా ఈ వార్తకు బాగానే ప్రయారిటీ ఇచ్చింది. అందులోనూ పార్టీ జనరల్ సెక్రటరీ హోదా కూడా జగన్ గతంలో ఇచ్చాడు కదా. అయితే ఇది ఊహించనంత సంచలన వార్తేమీ కాదు. వాస్తవానికి మైసూరా రెడ్డి కొన్ని నెలలుగా వైసీపీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు కూడా..

ఈ విషయాన్ని కూడా ఆయనే మీడియాకు చెప్పారు. కానీ ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారు..ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి.. ఈ అంశాలపై సాక్షి టీవీ ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారం చేసింది. తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు మైసూరారెడ్డి పార్టీ మారింది జగన్ వైఖరితో విసిగిపోయి కాదట. మరి ఇంకెందుకు అంటారా.. అందుకు సమాధానమే ఈ సాక్షి టీవీ కథనం. 

సిమెంట్ ఫ్యాక్టరీ కోసమే మైసూరా పార్టీకి గుడ్ బై చెప్పారా..?



మైసూరారెడ్డి తన గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారట. అందుకు తన సొంత గ్రామంలో భారీ ఎత్తున భూములు కూడా కొన్నారట. అయితే ఈ భూముల్లో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయట. వాటిలో కొన్ని రైల్వే పట్టాల కోసం రిజర్వ్ చేసినవి కూడా ఉన్నాయట. అందువల్ల సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు రావడం లేదట. 

సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల కోసం మైసూరా రెడ్డి 2014 నుంచి ప్రయత్నిస్తున్నాడట. కానీ ఆ ఫైలు మాత్రం ముందుకు కదలడం లేదట. టీడీపీలో చేరితేనే సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులన్నీ క్లియర్ చేస్తామని టీడీపీ నుంచి కబురు వచ్చిందట. టీడీపీ చేరితో సర్కారు భూముల వివాదం కూడా క్లియర్ చేస్తామని భరోసా ఇచ్చారట. అందుకే మైసూరా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారని సాక్షి టీవీ చెబుతోంది. మరి ఇందులో నిజం ఏంతో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: