మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దగ్గర ఇరవై సంవత్సరాలకి పైగా డాక్టర్ గా పని చేసిన కే పీ మాథుర ఇప్పుడు ఆమె మీద ఒక పుస్తకం రాసారు. "ద అన్‌సీన్‌ ఇందిరా గాంధీ" అనే పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు.  ఇందులో ఆయన పేర్కొన్న విషయాలు సంచలనానికి దారి తీస్తున్నాయి. భరత్ పాక్ యుద్ధం 1971 నవంబర్ లో  మొదలు కాగా ఆమె తన ఇంట్లో దివాన్ మీద బెడ్ కవర్ లు మార్చుకుంటూ ఉండేవారు అని ఆయన అందులో రాసారు. 'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 1971 నవంబర్‌ 5వ తేదీన యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తేదీన నేను వెళ్లేసరికి ఆమె ఆశ్చర్యకరంగా దివాన్ కవర్ లు మారుస్తూ కనపడ్డారు" అని ఆయన స్వయంగా రాసారు.




అది తన పని ఒత్తిడి నుంచి బయట పడ్డం లో భాగం అనుకున్నాను నేను. యుద్ధం మొదలు అయిన రోజు కూడా ఆమె చాలా సైలెంట్ గా ఉన్నారు అనీ అంత ప్రశాంతం గా ఆమెని ఎప్పుడూ చూడలేదు అని ఆయన రాసారు. కానీ 1966 లో ఆమె ప్రధాని అయిన తరవాత బాగా ఒత్తిడి ఫీల్ అయ్యేవారు అని చెప్పారు ఆయన. చాలా సార్లు అన్నం తిన్న తర్వాత పేకాట కూడా ఆడేవారు అని తన పుస్తకం లో ఆయన పేర్కొన్నారు.  'గురు ఆనందమయి మా' ఇచ్చిన రుద్రాక్ష మాల ఎప్పుడూ ఆమె మేడలో ఉండేదట

మరింత సమాచారం తెలుసుకోండి: