ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అయితే ఈ వేడి నుండి ప్రజలను రక్షించడానికి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధమైన చర్యలకు ఉపక్రమించింది. అన్ని రాష్ట్రాలకు కొంచెం భిన్నంగా చర్యలకు ఆదేశాలకు జారీ చేసింది బీహార్ ప్రభుత్వం. ప్రస్తుతం బీహార్ లో అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైమాటే. అందుకే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవ్వరూ కూడా నిప్పు జోలికి పోకూడదని ఆదేశాలుజారీ చేసింది.

 

బీహార్‌లో మండుతున్న ఎండలకు చాలా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడిమి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటనల్లో ఇప్పటివరకు 66 మంది ప్రజలు, 1200 జంతువులు చనిపోయాయని అంచనా వేయబడుతుంది. దీంతో బీహార్ సర్కార్ ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ఓ పరిష్కారాన్ని ఆలోచించింది. 

 

బీహార్ ప్రజలంతా ఉదయం 9 గంటలలోపే ధూప, దీప కార్యక్రమాలు ముగించాలన్నారు. అంతేకాక ఎలాంటి ఫంక్షన్లలోనైనా పొయ్యిల్లాంటివి ఉపయోగించరాదని పేర్కొంది. నిప్పుపొయ్యిలో వంట చేస్తున్నప్పుడు నిప్పురవ్వలు ఎగిరి పూరిగుడిసెలు అంటుకుంటున్న దృష్టాంతాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

పగటిపూట ఉదయం 9 గంటంల నుంచి సాయిత్రం 6 గంటల వరకు ఎటువంటి వంట కార్యక్రమాలు చేయకూడదని రాష్ట్ర ప్రజలను ఆదేశించింది. వంట చేసుకోడానికి ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పుకుండా పడనుందట. వంట పనులతో పాటు హారతి, హోమాలు, దీపారాధన వంటి నిప్పుతో కూడుకున్న పూజా కార్యక్రమాలను కూడా చేయవద్దని బీహార్ ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: