ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లో ఉన్న ప్రధాన నేత ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని మనదరికీ తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ నేతలంతా సైకిల్ దిగి కారెక్కిన తర్వాత ఇప్పుడు ఆయనే పార్టీలో కీలక వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో ఎట్టిపరిస్థితుల్లో చేరే అవకాశం లేదు కాబట్టి, ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నుండి త్రెడ్ ఉండే అవకాశం ఉంటుందని గ్రహించిన ఆయన తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు.

 

తనకు ప్రాణహాని ఉందంటూ తెలంగాణ టీడీఎల్పీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, పోలీసులపైనా నమ్మకం లేదని, అందుకే కేంద్ర బలగాల ద్వారా తనకు రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

 

 ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ...ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆధికారం అనేది వన్ సైడ్ గా మారిందని, ప్రభుత్వ అధికారులు, రక్షణా బలగాలు మొత్తం వారి ఆధ్వర్యంలోనే ఉన్నాయు కాబట్టి, తనను తీసివేస్తే ఇక తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, అందుకే తన ప్రాణానానికి ఏ క్షణమైనా హాని కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: