అనుకున్నంతా అయ్యింది. భయపడినంతపని జరిగిపోయింది. విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఊరటగా ఇదిగో..అదిగో.. అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రత్యేక హోదాపై కేంద్రం తేల్చి చెప్పేసింది. మీకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇన్నాళ్లూ దాగుడు మూతలుగా సాగిన వ్యవహారాన్ని పార్లమెంటులోనే క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేసేసింది. 

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి హెచ్ పి చౌదరి రాజ్యసభలో స్పష్టంగా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమే లేదని కామెంట్ చేశారు. విభజన అంశాలపై అధ్యయనం చేస్తున్ నీతి ఆయోగ్ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిందని చౌదరి సభలో స్పష్టంగానే చెప్పారు. 

ఏపీకి హోదా అవసరం లేదు.. నిధులు చాలు..


ప్రత్యేక హోదాకు బదులుగా ఏపీకి పలు రాయితీలు ఇస్తున్నామని కేంద్రమంత్రి చౌదరి వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అబివృద్దికి ఇప్పటికే 700 కోట్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం 2050 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని లెక్కలు చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని అన్ని విషయాలను అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. 

హామీలన్ని అమలు చేస్తున్నప్పుడు ఇఖ ప్రత్యేక హోదా అవసరం ఏముందని చౌదరి ప్రశ్నించారు. చౌదరి ప్రకటనపై అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి,. కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం సభలోనే చౌదరికి సమాధానం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే ఈ పరిణామం అందరికంటే ఎక్కువగా టీడీపీని ఇబ్బందిపెడుతోంది. బీజేపీతో కలసి ఉండలేక, బయటకు రాలేకా సతమతమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: