మరోసారి హీరో శివాజీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీసుకునే విధివిధానాలపై ఆయన తీవ్ర అసహనాన్ని వెళ్లగక్కారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మొండిచెయ్యి చూపించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో సమస్యలకు లోనవుతోందని, వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు.

 

‘మన పీఎం గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ఆర్టీఫీషియల్ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధాన మంత్రి కాదు' అని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రధాని నుంచి ఒక ప్రకటన వెలువడితే గానీ స్పష్టత రాదేమోనన్న ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.‘ఆంధ్రప్రదేశ్ అంటే మోదీకి కక్ష, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుగారంటే మోదీకి కసి.

 

పిచ్చి వ్యూహాలు, రాజకీయకుయుక్తులు పన్నుతున్న మోదీకి తెలియదేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడ్వాన్స్ డ్ పీపుల్ అని. ఇటువంటివన్నీ ఇక్కడి ప్రజలు నమ్మరు. ఎవరైతే బీజేపీ వైపు వెళతారో వారికి ఉన్న విలువ కూడా పోతుంది. సమస్యే లేదు, ఏపీ ప్రజలకు మోదీపై నమ్మకమే లేదు. బీజేపీతో ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చి, కేంద్రంపై ఎదురుదాడి చెయ్యాలి. ఏపీకి ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతోంది’ అని శివాజీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: