ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాసే జనాలు ఎంతమంది ఉంటారు ? వాట్స్ యాప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ లాంటివి ఒచ్చి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసే పద్ధతి ని పూర్తిగా మార్చేశాయి. ఈ పరిస్థితి లో టెక్నాలజీ అండతో సాగుతున్న ప్రపంచం పెన్ను పట్టుకుని అక్షరాలూ రాయాలి అంటే అది అత్యంత బద్దకంగా మారిపోయే పని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పోస్టల్ సంస్థ లకీ, పోస్టల్ ఉద్యోగులకీ పని లేకుండా పోయింది. దాంతో ఆదాయం కూడా కనపడ్డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయట పోస్టల్ కంపెనీలు.



ఫిన్లాండ్ లో పోస్టల్ సంస్థకు ఓ కొత్త ఐడియా వచ్చింది. పోస్టల్ ఉద్యోగులు ఉత్తరాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఎవరైనా కోరితే వారింట్లో గడ్డిని కత్తిరించి ఇస్తారట. ప్రతీ మంగళవారం ఈ పని పెట్టుకుంటున్నారు వారు. సో మంగళవారం ఖాళీగా ఉండకుండా ఎవరైనా తమ కస్టమర్ లు ఫోన్ చేసి కోరితే పోస్ట్ మ్యాన్ వెళ్లి గడ్డి కత్తిరించే ఏర్పాటు పెట్టారు .అందుకు గానూ కస్టమర్లు నెలకు 5000 రూపాయలు చెల్లించాలట. ఈ ఐడియా బాగానే వర్క్ అవుతోంది అంటున్నారు పోస్ట్ మ్యాన్ లు.

మరింత సమాచారం తెలుసుకోండి: