రెడ్డి సామాజిక వర్గం వారు చంద్రబాబు గారి భజన చెయ్యడం కోసం పోటీ పడుతున్నారు అని రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం చెబుతోంది. ఒక ప్రాంత రాజకీయాల గొడవలు అక్కడి వర్గాల బట్టీ నో అక్కడి కులాల వర్గీకరణ బట్టీనో ఆయా పార్టీల నాయకులు అక్కడ జేరుతూ ఉంటారు. ఒకడు పార్టీ లో ఉంటే అతనికి ప్రత్యర్ధి ఐన వేరే అతను ఆపోజిట్ పార్టీ లో ఉంటాడు అవసరం కొద్దీ పార్టీలు మారడం జనాలకి పెద్ద కొత్త విశేషం ఏమీ కాదు. రాజకీయ సిద్దాంతాలూ , రాద్ధాంతాలూ ఎవరికీ అవసరం లేదు. ఒక కులం పార్టీ తరఫున మరొక కులం పార్టీ వారు జాయిన్ అవరూ, సపోర్ట్ చెయ్యరు అంటారు కానీ రియాలిటీ లో అదేమీ కనపడదు.




రెడ్డి కులస్థులు అందరూ వైకపా అనీ టీడీపీ కి కమ్మోళ్ళు కాపు కాస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది కానీ వైకపా లో కమ్మోళ్ళు ఉన్నారు, టీడీపీ లోనూ రెడ్డి బృందం ఉంది. ఈ రెండు కులాలు కాకుండా ఇంకా బోలెడు కులాలు మన రాష్ట్రం లో. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి తన పదవి కోసం చంద్రబాబు ముందు మోకరిల్లారు అనే వార్త అందరికో అసహనం రేపుతోంది. రెడ్లు రెడ్లు ఫుల్ సపోర్ట్ ఇచ్చుకోవాలి కానీ ఈ టీడీపీ కి డబ్బు ఏంటి అంటున్నారు. మరొక పక్క మైసూరా రెడ్డి గారిది మరొక భాగోతం. టిఫిన్ కి పిలిచి పార్టీ లో జర్చుకున్నారు అనే ఆయనే చెప్పి నవ్వుల పలు అయ్యాడు. మరొక పక్క అకస్మాత్తు గా టీడీపీ లో రెండేళ్ళ తరవాత జేరిన గాదె వెంకట రెడ్డి ఎందుకు మారారు అనేది కూడా చెప్పలేదు. రెడ్ల కి ఎసరు పెట్టు రెడ్లని కాపాడుకోలేని జగన్ జనాలని ఏం కాపాడతాడు అనిపించాలి అనేది బాబుగారు ప్లాన్ గా తోస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: