ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని శుక్రవారం పార్లమెంటు సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పేసింది. పన్ను రాయితీలు, నిధులు ఇస్తున్నందువల్ల ప్రత్యేకంగా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన పని లేదని కేంద్రమంత్రి చౌదరి కుండబద్దలు కొట్టి పార్లమెంటులో చెప్పేశారు. దీనిపై ఏపీలో రాజకీయ పార్టీల నుంచి, ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

పవన్ ఘాటు ట్వీటు.. 


ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి ప్రత్యేక హోదా విషయంపై ఘాటుగా ట్విట్టర్ ద్వారా స్పందించాడు.  "సరిగ్గా రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని పార్లమెంటు నుంచి బయటకు గెంటి వేసి.. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదు..మరచిపోరు కూడా" అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు పవన్.

పవన్ దాడి మొదలైంది..


"ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్రప్రజల నమ్మకంపై కొట్టి బీజేపీ కూడా అలాంటి తప్పువైపే అడుగులు వేయకూడదని  నేను కోరుకుంటున్నాను.. ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్ల మీద కొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కలుపుకుని పార్లమెంటులో దీనిపై పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరపున నా విన్నపం" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: