ఒక రాజకీయ నాయకుడు ఉన్నత పదవి అలంకరిస్తే తన ప్రాంతానికి మేలు చేసుకోవాలని భావిస్తాడు. చాలామంది నాయకుల విషయంలో ఇది నిజమైంది. కానీ అందరూ అలా ఉండాలని ఏంలేదు. అందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ అంటూ ఏర్పడిన తర్వాత నుంచి ఎక్కువగా రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు వచ్చిన సంగతి తెలిసిందే. 

కానీ రాయలసీమ ప్రాంతం మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. అందుకు అక్కడి భౌగోళిక పరిస్థితులు చాలావరకూ కారణమే అయినా సీమ నాయకుల్లోనూ తమ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలన్న కాంక్ష లేదన్న కామెంట్లు కూడా వినబడతాయి. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత వైఎస్ జగన్ విషయంలోనూ అలాంటి కామెంట్లు వినిపించడం ఆసక్తిగాయకంగా మారింది.

జగన్ గుట్టు బయటపెట్టిన మైసూరా.



మొన్నటికి మొన్న పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన మైసూరారెడ్డి కూడా తన రాజీనామా లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు మైసూరా రెడ్డి కొన్నాళ్ల క్రితం కొంత కార్యాచరణ ప్రారంభించారు. ఇందు కోసం ఓ వేదికను తయారు చేశారు. అయితే ఈ విషయంలో మొదట ఆసక్తి చూపిన జగన్ ఆ తరవాత  పట్టించుకోలేదట. 

రాయలసీమ హక్కుల వేదిక సభలకు వైసీపీ ఎమ్మెల్యేలను పంపించాలని మైసూరారెడ్డి జగన్ ను కోరారట. కానీ అందుకు జగన్ అంగీకరించలేదట. మొదట్లో సానుకూలంగా ఉన్న జగన్ ఆ తర్వాత మనసు మార్చుకోవడం మైసూరాకు ఆగ్రహం తెప్పించింది. కానీ పాపం ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరమయ్యారు.  చివరకు తన రాజీనామాలేఖలో ఆ సంగతి బయటపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: