తెలుగుజాతికి తెలుగుదనం నిండుగా ఆవిష్కరించిన నందమూరి తారక రామారావు గారి ఆత్మ క్షొభించిన సందర్భమే, తెలుగుజాతి  పతనానికి నాంది ప్రస్థావన.  ఐకమత్యం కోల్పోవటానికి  పునాది.  చంద్రబాబు గారిలా మనం కూడా అధికారములోకి రావాలనే భావన కొందరిలో అంకురించింది. ఒక రకమైన అధికార దాహం, దాహార్తిని తృప్తి పరచుకోవటానికే అవినీతితో సిగ్గనేది లేకుండా సంపదపోగేసుకోవటం ప్రారంభమైనది. అంతకు ముందు అవినీతి ఉన్నా అది అంతర్లీనంగా ఉండి రహస్యమైన విషయం గా పరిగణించేవారు. చంద్రబాబు అధికారములోకి వచ్చాకే అవినీతి పై అసలు ప్రజల్లో అలసత్వం, వదిలివేసే ధోరణి పెరిగిపోతోంది.


జామాతా దశమ గ్రహ

 


ప్రతివారు చంద్రబాబునే అనుసరించటం అంతేకాదు "ప్రతిదాన్ని మానేజ్ చేయటమనే  తత్వం పెరిగిపోయింది".  ప్రజాస్వామ్యంలోని నాలుగు స్థంభాలు అంటే చట్టసభలు, పరిపాలనా మండలి, న్యాయవ్యవస్థ, ప్రసార మాధ్యమాలు అనే మీడియా  కూడా "మానేజబుల్" అనే పరిభాష కు ఆదర్శం ఆదిపురుషుడు చంద్రబాబే అని అంటారు అనెకమంది బుద్దిజీవులు.



 

భాబు ఏదిగే క్రమంలో ప్రజల్లో ఎస్.సి., బి.సి., అనే కులాలకు  ప్రత్యామ్న్యాయంగా వాడుకలో ఉన్న పేర్లు,  “సేం-కాష్ట్.,  బాబు-కాండిడేట్”  అని చెపుతారు.  అక్కడే కుల దురహంకారానికి,  ధనదాహానికి,  ఆశ్రిత పక్షపాతానికి, బంధు ప్రీతికి ఒక రకమైన - తప్పుకుకు ముసుగేసి రహస్యం గా ఉంచే సాంప్రదాయం నుంచి ముసుగు తీసి బహిరంగ రహస్యమవటానికి తప్పుచేసినా సిగ్గుపడవలసిన అవసరంలేదు- అన్నట్లు సమాజ నిర్మాణం మారిపోతుoదిపైనుండి క్రింద స్థాయివరకు ఉన్నతపదవిలో ఉన్నవారినుండి సాధారణ కార్యకర్త వరకు నరనరాన జీర్ణించుకుపోయింది ఈ సిగ్గుమాలిన తనం.   బహిరంగంగా మాట్లాడుకోవటం ప్రారంభమైనది. “పిడికిలి మూస్తేనే గుట్టు, ఒక్క సారి తెరిస్తే అది రట్టే”.  ఇంకేముంది సారు మొదలెట్టినమీడియా మానేజ్మెంట్”  తెలుగు జాతిని స్థాయికి చేర్చిండంటే - ఒకరు చదివే దినపత్రిక ను చూచి వారు కులానికి చెందినవారో,   పార్టీకి చెందినవారోచెప్పటం వాడుకలోకి వచ్చింది.




విధం గా సమాజం నిట్టనిలువుగా చీలిపోయింది. చివరకు తన కొత్తపలుకు లో ఆంధ్రజ్యోతి కమ్మకులం ఇతర జనమానసాల నుండి ఎలాదూరమైపోతోందో రాసుకునేటంత. నిజాన్ని నొక్కి చెప్పిన రాధాకృష్ణ ను అభినదించటం సంధర్భములో ఎంతైనా సందర్భోచితంరామారావు గారికి జరిగిన అవమానం తరవాత, జాతి నిట్టనిలువునా చీలిన తరవాత, ఆంధ్రుల నూతన రాజధాని ప్రజలకు చెందనిదిగా, ఒక కులానికి, ఒకప్రాంతానికి చెందినదైంది. ఇందులొ ఎన్నో మతలబులు దాగున్నాయంటారు. రాజకీయ కుతంత్రానికిది కేంద్రబిందువైంది. భవిష్యత్ లో తెలుగు జాతి మరో చీలికకు గురయ్యే కార్యక్రమానికి ఇది నాంది అంటారు.


 

క్రొత్త రాజధానిని ఎవరు నిర్మించియివ్వాలి? ఇందుకు పూర్వాపరాలు ఎవరు నిర్దెశించాలి? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కేంద్రం. అలాంటి రాజధానిని తనకై తానే నిర్మిస్తానని, వనరులు సమకూర్చుకుంటానని విశ్వంలోనే నభూతో-నభవిష్యతి లా నిర్మిస్తానని చంద్ర బాబు చెప్పటం తెలుగుజాతికే కాదు భారతజాతికంతా తెలుసు. ఇక ఇక్కడ కేంద్రానికేం పని. కేంద్రాన్ని తిట్టటమెందుకు. చేసే ప్రారంబోత్సవా లకు ఒక అతిది గా మాత్రమే వచ్చే పరిస్థితి మోడీ కి కల్పించిందెవరు? కేంద్రంతో లేదా మోడీతో చేయించవలసిన పనుల ప్రారoబోత్సవాలకు ఆయన అతిదిగా వచ్చే దురదృష్టం ఆయనకు ఎవరు కల్పించారు? తెలుగు వారిని ఆయనకుదూరం చేసే ప్రయత్నాలు చేసే దెవరు?  ముందుకు ముందు దుందుడుకు చర్యలతో కేంద్ర ప్రమేయాన్ని చట్టబద్దంగా వాడుకొనే అవకాశం వదులుకొని ఇప్పుడు కేంద్రం సహకరించటము లేదనటం న్యాయమా? సహకారం కొరేవాళ్ళు,  ప్రయోజనం పొందేవాళ్ళు,  ఎల్లవేళలాసహకరించవలసిన వాళ్ళను చూసే’  తీరేనా ఇది? నమస్కారం చేసినవాళ్ళకు ప్రతి నమస్కారం చేయటమే సంస్కారం అంటారు,  అలాగే సహకరించవలసిన వాళ్ళకు అవకాశం సాంప్రదాయభద్దంగా ఇవ్వటమే సంస్కారం కాదా? పరిస్థితి స్థాయికి చేరిందంటే బోండా ఉమ, రావెల కిషొర్, పత్తిపాటి పుల్లారావు లాంటి వారు కూడా కేంద్రాన్ని, మోడీని నిందించే పరిస్థితికి ప్రొటోకాల్ను  దిగజార్చిన ఘనత ఎవరిది?



మోడీని కాదు - తనకు జాతికి మేలు చేయని రుచించని విధంగా ప్రవర్తించే నాయకుడే దీనికి సమాదానం చెప్పాలి. రాష్ట్ర నాయకుని స్థలములో (జగన్ కాకుండా) అనామకుడు నాయకుడైనా ఉంటే కూడా ఒక విశ్వనగరం ఇప్పటికే నిర్మితమయ్యే మార్గములో ఉండేది. నాయకుని భూసేకరణ, సింగపూర్ ఈశ్వరన్ (ప్రజలకు పారదర్శకం కాని ప్రవర్తన) తో సారు తీరు, విదేశాల నాయకులతో సాగించే రహస్య మంతనాలు చూసి, సహకారమందించే వాళ్ళు "అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల" అనేలా ఫీలింగ్ కలగకుండా ఉండదా?




 

కేంద్రములోని అధికార పక్షానికి మిత్ర పక్షము, ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన పార్టీ నాయకుడు వైరిపక్షం తో (జనతాదళ్) సభల్లో సమావేశాల్లో పాల్గొనటం కేంద్రానికెలా రుచిస్తుంది? ఇది మరో వెన్నుపోటుకు దారితీయనుందని చరిత్ర తెలిసిన వాళ్ళే అనేటప్పుడు మోడీ మనసు, కేంద్రం తీరు కలుషితమవవా? తీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కీడు చేయదా? ప్రజలుకాంగ్రెస్ ను బిజేపి ని ఒకే గాటన కట్టటానికి కారకులు’  ఎవరు? ఎవరి నడవడిక, తీరు దీనికి కారణం?

 

మోడీ కంటే తాను సీనియర్ ముఖ్యమంత్రి నని, మోడీ కంటే ముందు ప్రధాని అవ్వవలసిన వాడి ననే ఫీలింగ్ చంద్రబాబుకు ఉందంటారు. చాలామంది మాజీ ముఖ్యమంత్రులకు (మాయావతి, ళాలుప్రసాద్, మూలాయం) మరియు ఇప్పటి ముఖ్యమంతృలకు (ఖేజ్రివాల్, జయలలిత, మమత, నితీష్) ఉన్నట్లు ప్రధాని అవ్వాలనే కోరిక చంద్రబాబుకు కూడా ఉంది. అందుకే 2019 వరకు ఆంధ్ర ప్రదెశ్ ముఖ్యమంత్రిని చేసి తాను ప్రధాని అవ్వాలనే ఆలోచనతోనే బాబు చిలవలు పలవలైన జనతాదళ్ పాతమిత్రులైన దేవేగౌడ, లాలు, నితీష్ మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించే పనిలో పడి బాబు తాను బిజేపి మిత్రపక్షంలో ఉన్నవిషయం మరచి వైరిపక్షం లో చేరి వారి సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారని దూరశ్రవణమో, ఆకాశంలో ఉండే ఆకాశవాణి ద్వారా కెసీఆర్ సహాయంతో మోడీ అంతా తెలుసుకున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఏనాడో వెల్లడించింది. మరి ఇలాంటి అపర చాణక్యుడను కొనే అపర రాక్షసామాత్యుణ్ణి అసలు సిసలైన ఆధునిక చాణక్యులైన అమిత్-షా, మోడీలు ఏనాడో గుర్తించారు, అందుకే సారి వెన్నుపోటు దెబ్బ అఖిల ఆంధ్రప్రదెశ్ ప్రజానీకానికి తగిలెలా గురి తప్పించారు.  విభజన ఫలాలు దక్కాలంటే, ఆంధ్రులంతా (కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా) సమైఖ్యంగా మోడీని కలిస్తే మంచిది. ఫలితం ఉంటుందంటారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: