సినిమాల ద్వారా కంటే వివాదాల ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకునేవారి జాబితాలో అగ్రస్థానంలో ఉంటాడు మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.  ఏ ఇష్యూలపై పబ్లిక్ అటెన్షన్ ఉంటుందో వాటిపై ట్వీట్లు చేయడం వర్మకు అలవాటే. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసి ఆయన అభిమానులతో తిట్లు తినడం వర్మకు భలే సరదా.

ఐతే ఆ సరదా కాస్తా శ్రుతి మించుతున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌదరి శుక్రవారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో పవన్ ట్వీట్ ద్వారా స్పందంచిన సంగతి తెలిసిందే. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదని, మరచిపోకూడదని పవన్ ట్వీచ్ చేశారు.

వర్మకు చిరాకు తెప్పించిన పవన్ ట్వీట్లు..


ఈ రోజు ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి భాజపా కూడా అలాంటి తప్పువైపే అడుగులు వేయకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రత్యేకహోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్‌లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరపున విన్నవిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించిన దానిపై వర్మ ప్రతి స్పందించారు.

పవన్ కు చిర్రెత్తిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 


‘ఫ్లాప్‌ అయినా మాకు గబ్బర్‌సింగ్‌ కావాలి కానీ.. బెగ్గర్‌సింగ్‌ కాదు. సినిమాల్లో వార్నింగ్‌లు ఇచ్చి.. నిజజీవితంలో విన్నపాలు చేస్తే పవర్‌స్టార్‌కు అర్థం ఏమిటి? డిమాండ్‌ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కానీ విన్నవిస్తే రాదు.. అభిమానులైన మాకు.. మీ నోటి నుంచి హెచ్చరికలు వినాలి. మీ నోటి నుంచి విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: