యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి దండ్రులు ఆమె పాలిట రాక్షకుల్లా మారారు. కొన్ని సంవత్సరాల పాటు ఆమెను ఇంట్లో బంధించి కర్కశంగా ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. ఇంతటి ఘోరాన్ని చూస్తున్న ఏ సమాజం అయినా ఊరుకుంటుందా...? ఆమెను వారి తల్లిదండ్రుల చేర నుంచి విడిపించారు. ఆమెను బంధించిన గది నుండి ఆమెను బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆమెను మీడియా చుట్టుముట్టింది, వారిపై వారి తల్లుదండ్రులు ప్రవర్తించిన తీరును  సభ్య సమాజం అసహ్యించుకుంది. ఆమె పేరే ప్రత్యూష.

 

ఆమెకు జరిగిన అన్యాయాన్ని మేదిఆ ద్వారా తెలుసుకున్న అకెకేఆర్ ఆమెను చేరదీసి తనకు కావాల్సిన ఏర్పాట్లను ఆయనే దగ్గరుండి చూసుకొంటానని, ఆమెను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చి దిద్దుతానని మాటిచ్చారు. ఆమెకు నచ్చిన అబ్బాయితో కూడా వివాహం జరిపిస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే,  ఐ సంఘటన జరిగిన తర్వాత ప్రత్యూష తన చదువును కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కి ఆమె మరో కోరిక కోరనుంది. అదేంటంటే, ప్రస్తుతం ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం సంరక్షణలో ఉన్న ప్రత్యూష ఇప్పుడు తనను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటోంది.

 

ఓ అటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని తాను పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష అధికారులకు చెప్పగా, వారు కేసీఆర్ కార్యాలయానికి సమాచారం అందించారు. తనను ఆన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆమె ప్రేమ విషయం పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి...!


మరింత సమాచారం తెలుసుకోండి: