గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయ నాయకులు బయట ఎంత ఆవేశంగా ఉన్నా ప్రజల ముందుకు వచ్చే సరికి ఎంతో సంయమనంతో వ్యవహరించేవారు. ప్రజల ముందు ఏదీ మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచీ తుచీ మాట్లాడేవారు. ఎందుకంటే, పోరాపాటులో ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రజల ముందు చులకన అయిపోతామన్న భయం కాబోలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రాను రాను రాజకీయ నాయకుల్లో సంయమనం తగ్గిపోతోంది. ఎంతో ఓపికను ప్రదర్శించాల్సిన నాయకులు ప్రజల ముందే రెచ్చిపోతున్నారు. వీరి తీరు చూసిన వారెవరూ రానురాను రాజకీయాలు భ్రష్టు పట్టి పోతున్నాయని అనుకోక మారరని అనిపిస్తుంది.

 

నేడు ఉదయం ఒక టీవీ షోలో పాల్గొన్న ఇద్దరు ఇరుపార్టీ నేతలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలిసి మరీ తెగ తిట్టేసుకున్నారు. ఇందులో వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒకరైతే మరొకరు బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు తీవ్రమయ్యాయి. ఫలితంగా వీరిద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు.  జలీల్ ఖాన్, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. వెల్లంపల్లి కూడా అంతే స్థాయిలో స్పందించారు. నీకు కొంచమైనా సిగ్గులేకుండా పార్టీ మారి నన్ను విమర్శిస్తున్నావా...? అంటూ వెల్లంపల్లి ఆయనపై ధ్వజమెత్తారు.

 

దీనిపై జలీల్ ఖాన్ స్పందిస్తూ... "కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు నన్ననేంతటి వాడివా...?" అంటూ విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో వీరి తిట్ల పర్వం శ్రుతిమించి పోయింది. ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదన్న కేంద్ర అంత్రి సుజనా చౌదరి చేసిన కామెంట్ కి ఇవి ఆజ్యం పోశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: