తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ పరిస్థితి పుండు మీద కారం చల్లిన చందంగా తయారైంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒకరి తర్వాత ఒక వలసలు వరస కడుతుంటే, తెలంగాణ లో ఏకంకా పార్టీనే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో జగన్ బంతిలా తయారయ్యారు. ఇన్ని రోజులు జగన్ కు కేసీఆర్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ చర్యలతో పటాపంచలు అయింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి బరిలోకి దిగుతాయన్న ఆశలు, అంచనాలు కూడా గల్లంతయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలంతా ఎప్పుడూ సైకిల్ ఎక్కుదామా అని వేచి చూస్తునట్లు సమాచారం, ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వైసపీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలా అయితే వైసీపీ పరిస్థితి ఏంటని, భవిష్యత్తులో పార్టీ మనుగడపై గూడా ప్రశ్నార్థకంగా మారనుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

వైసీపీ అధినేత తెలుగు రాష్ట్రాల్లో ఇంత జరుగుతున్నా మీడియా ముందు అధికార పక్షాలపై మండిపడుతున్నారు తప్పితేపార్టీ పటిష్టతకు తగిన చర్యలు మాత్రం తీసుకోవట్లేదని కొందరి నేతల అభిప్రాయం. ఇద్దరు చంద్రుల మధ్య పార్టీ నలిగిపోకుండా ఉండాలంటే ఇప్పటికైనా పార్టీలో వ్యవస్థాగత స్థాయిలో మార్పులు చేసి, ఎమ్మెల్యే లా వలసలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించితే వైసీపీ కి కాస్త అనుకూల ఫలితాలు కనబడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: