ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మనుగడలో ఉన్న పార్టీలు రెండే. అవి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. టీడీపీ దాదాపుగా కనుమరుగైనదనే చెప్పవచ్చు. ప్రస్తుతం జగన్ కి తెలంగాణ లో కేడర్ బాగానే ఉందని గ్రహించిన అధిష్ఠానం అయితే భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండే విధంగా ఉండాలని ఆలోచన చేసిన కేసీఆర్ పొంగులేటిని ఆకర్ష్ పథకంలో భాగంగా తమవైపు తిప్పుకున్నారు.

 

ఇంక తెలంగాణ లో మిగిలిన ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే కేసీఆర్ భవిష్యత్తులో బీజేపీ తో కంటే కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఒకవేళ రాబోయే ఎన్నికల్లోకేంద్రంలో కాంగ్రెస్ తమ  మెజారిటీని నిరుపించుకొంటే అలాంటి సందర్భంలో కాంగ్రెస్ తో జతకట్టి మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవచ్చనే ఆలోచన కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటు చేసుకొనే అవకాశం ఉన్నందున, దీనిపై సమగ్ర విశ్లేషణ చేసిన కేసీఆర్ రాజకీయ పరిస్తులు ఎలా మారినా అధికారం మాత్రం తమకే దక్కాలని పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. పైగా టీడీపీ , వైసీపీ పార్టీలు ఆంధ్రాలో ఆవిర్భవించినవి కాబట్టి అంధ్రా పార్టీలకు అధికారం అప్పజెప్పితే తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతయనే విషయాన్ని ఇప్పటికే ప్రజలో మెదళ్లలో జోప్పించడంలో కేసీఆర్ విజం సాధించారు కాబట్టి, ఆయన మాటను ప్రజలు తప్పక అనుసరిస్తారనే నమ్మకం కూడా. అందుకే ఆ పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో చెలామణి కాకుండా ప్రణాళికలను సిద్ధం చేశారని సమాచారం...!  


మరింత సమాచారం తెలుసుకోండి: