తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఆర్థికంగా,  నానసికంగా వేధిస్తున్నాయని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలపై కొరడా ఘులుపించడానికి సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం పట్ల ప్రైవేటు యాజమాన్యం తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ త్వరలో జరిగే ఎంసెట్,  టెట్ పరీక్షలకు జరిపించడానికి తమ భవనాలను ఇవ్వబోమని తెగేసి చెప్పేశాయి. ఈ నిర్ణయం తో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వ యంత్రాంగం.

 

కొన్ని రోజుల తర్వాత, దీనపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరీక్షలన్నింటినీ ప్రభుత్వ కళాశాలల్లో జరిపిస్తామని తన నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. 15న ఎంసెట్, 22న టెట్ నిర్వహించనుట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి అయిన కడియం శ్రీహరి స్పష్టం చేశారు. 12 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు, 13 నుంచి టెట్ హాల్ టికెట్లుడౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. సెంటర్లు మారే అవకాశం ఉండడంతో.. అభ్యర్థులు కచ్చితంగా హాల్టికెట్లు చెక్ చేసుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు.

 

అయితే, ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయం పాట్ల కంగుతిన్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం, తమకు తాముగా ప్రభుత్వం దిగివస్తుందని ఉహించిన యాజమాన్యం అంచనాలు తలక్రిందులు అయ్యాయి. దీంతో చేసేది ఏమీ లేక ప్రైవేటు యాజమాన్యాలు తమ భావనాలను పరీక్షా కేంద్రాలుగా వాడుకోవడానికి అనుమతిని ఇచ్చాయి. దీంతో.. తనిఖీలు జరిగి తీరతాయన్న సంకేతాన్ని స్పష్టంగాకేసీఆర్ ప్రభుత్వం పంపించగలిగింది.దీంతో..టెట్, ఎంసెట్కు సహకరిస్తామని తమంతటతాముగాచెప్పేంతవరకూ.. యాజమాన్యాలు దిగి రావాల్సి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: