ఒక వైపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు పూనుకొంటే, వాటి వల్ల ఆంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, కేసీఆర్ దూకుడికి చెక్ పెట్టడానికి, కేసీఆర్ మీద కేంద్ర ప్రభుత్వానికి కంప్లేంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు బాబు. ప్రస్తుతం కేసీఆర్ అవలంభిస్తున్న విధి విధానాల వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని. కేంద్ర జలసంఘానికి, మంత్రులకు విన్నవించాలని బాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది.


ఆంద్ర రాష్ట్రానికి ప్రాణాధార గోదావరి, కృష్ణా నదులు ఇప్పటికే వర్షాలు లేక అలాడుతున్నా రాష్ట్రాన్ని ఆదుకుంటున్నది ఆ రెండు జీవ నదులే. ఇప్పుడు కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు కట్టినట్లైతే, కనీసం మాకు తాగడానికి కుడా నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందని ప్రజలు ఆయన ముందు వాపోతున్నారు. అందుకే ఈ నిర్మాణాలను ఆపేయాలని, నీళ్లలో మావాటా మాకు న్యాయంగా కావాలని ఆయన కేంద్రాక్ ప్రభుత్వం ముందు డిమాండ్ చేయనున్నారు.


ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రానికి కేసీఆర్ కొత్త సమస్యను తెచ్చి పెట్టారు. కేసీఆర్ అవలంభించే విధి విధానాలు బాబుకు ఎప్పుడూ చిక్కులు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. సమైక్య పాలనలో ఆంధ్ర నాయకులు తెలంగాణ కూ తీవ్ర అన్యాయం చేశారని పడే పదే చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర విషయంలో అదే రూట్ ను ఫాలో అవుతున్నట్లు  తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: