ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే సమయానుకూలంగా స్పందించకపోతే.. అమృతమైనా విషం అవుతుందంటూరు. మరి ఆంధ్రా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కూడా ఈ సూక్తిని పట్టించుకోవడం లేదా.. ఆయన కూడా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా పీకలమీదకు తెచ్చుకుంటున్నారా.. పార్టీలోని వలసల ఇష్యూను లైట్ గా తీసుకుంటున్నారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

వలసల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ జగన్ మాత్రం తరచుగా ఢిల్లీ యాత్రలు మాత్రం పెట్టుకుంటారు. ఏపీకి న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రులను వీలైతే ప్రధాన మంత్రిని కూడా కలుసుకుంటుంటారు. తాజాగా కూడా జగన్ డిల్లీ యాత్ర చేశారు. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతున్న కీలక సమయంలోనూ జగన్ హస్తినయాత్రలను మాత్రం వాయిదా వేసుకోలేదు. 

జగన్ కేవలం ఓ ప్రతిపక్షనేత. ఆయన చెప్పినంత మాత్రాన కేంద్రం హడావిడిపడి ఏపీకి న్యాయం చేసే పని తలకెత్తుకోదు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం చెవిన ఇల్లు కట్టుకుని పోరుతూనే ఉన్నాడు. మరి జగన్ డిల్లీ యాత్రలకు ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నాడు.. ఈ సందేహాలకు సీఎం చంద్రబాబు తన విమర్శలతో సమాధానం ఇస్తున్నాడు. 

రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసే సాకుతో జగన్ తన కేసుల గురించే కేంద్రమంత్రులను కలుస్తున్నాడని చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. అంటే కేసుల మాఫీ కోసం కేసీఆర్ ఏపీకి న్యాయం అనే ముసుగు వేసుకుని కేంద్రంతో బేరాలు కుదుర్చుకుంటున్నాడనేది చంద్రబాబు అభియోగం. జగన్ డిల్లీ యాత్రలకు ఇచ్చే ప్రయారిటీ చూస్తే బాబు ఆరోపణలు నిజమేమో అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరు చెప్పేది నిజమో జనమే అంచనా వేసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: