మొన్న సమావేశమైన ఏపీ కేబినెట్ కేంద్రానికి ఓ తీర్మానం చేసి పంపాలని నిర్ణయించింది. తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. విభజన చట్టానికి లోబడే తెలంగాణ ప్రాజెక్టులు ఉండాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. అంటే ప్రాజెక్టుల విషయంలో న్యాయపోరాటానికి సిద్ధపడిందన్నమాట. 

ఐతే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఏపీ కేబినెట్ సమావేశంలో అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? గోదావరి, కృష్ణాలపై ప్రాజెక్టుకు కట్టాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. మొన్నటికి మొన్న శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టులు కట్టి తీరతామని తెలంగాణ అసెంబ్లీలోనే ప్రకటించారు. ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చారు. కానీ అప్పుడెప్పుడూ చంద్రబాబు ప్రాజెక్టులపై స్పందించిన పాపాన పోలేదు. 

చంద్రబాబును కదలించిన జగన్.. 


అంతేకాదు.. ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రా, తెలంగాణ చర్చించుకుని ముందుకుపోతామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ విషయంపై మాట్లాడుకున్నామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఇంతలోనే సీన్ ఎందుకు రివర్సైంది. అంత సుహృద్భావ వాతావరణం ఎక్కడ ఆవిరైపోయింది. అంతుకు సరైన కారణం ఏంటి..

కేసీఆర్ కృష్ణానీటిని రాయలసీమకు రాకుండా ఆపేస్తున్నారు.. కొత్త ప్రాజెక్టులు కట్టుకుని మరలించుకుంటున్నారని జగన్ ఇటీవల గొంతెత్తడమే సీన్ రివర్స్ కావడానికి కారణంగా భావించొచ్చు. కేసీఆర్ తో కయ్యానికి జగన్ సిద్ధపడిపోవడంతో చంద్రబాబు కూడా డిఫెన్సులో పడిపోయారు. ఎక్కడ జగన్ హీరోగా నిలబడతాడో అన్న శంకతో కేసీఆర్ తో జల పోరాడానికి బలవంతంగా సిద్ధపడిపోయాడు. 

దీనికితోడు జగన్ ఏకంగా జలదీక్షకు దిగుతానని ప్రకటించడంతో చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పుడిప్పడే వైసీపీని వలసలతో దెబ్బ కొట్టామని భావిస్తున్న బాబు.. ఒక్క దెబ్బతో మళ్లీ సీన్ అంతా జగన్ కు అనుకూలంగా మారిపోతుందని గ్రహించి అర్జంటుగా కేబినెట్లో తీర్మానం పెట్టేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: