తెలుగు రాష్ట్రాల వాతావరణంలో గత కొద్ది రోజులుగా కొంత మార్పు కనబడుతోంది. మొన్నటి వరకు తీవ్ర ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా సాయంత్రం పుట జల్లులూ కురుస్తున్నాయి. వీటితో ఇన్ని రోజులు ఇబ్బందిపడ్డ ప్రజలకు కాస్త సాంత్వన కలిగించాడు వరణుడు. సాయంత్రం పూట పడే చిరు జల్లులతో వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. పైగా వాతావరణం కుడా పూర్తిగా చల్లబడింది.  


రెండు రోజుల క్రితం వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధార‌ణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదై ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనంత‌రం అక్క‌డి వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డింది. గ‌త నెల ఆరంభం నుంచి భానుడి భ‌గ‌భ‌గల‌ను మాత్ర‌మే చూస్తోన్న ప్ర‌జలు ఇప్పుడు ఈదురు గాలుల‌తో జ‌ల్లుల్ని చూస్తున్నారు. దీంతో వాతావ‌ర‌ణం కాస్త‌ చ‌ల్ల‌బ‌డింది. అనంత‌పురం, క‌డ‌ప, తిరుప‌తి మిన‌హా వేరే జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త 40డిగ్రీల‌కు దాట‌లేదు. కోస్తాంధ్ర, రాయ‌ల‌సీమ‌ల్లో ఉరుముల‌తో కూడిన వర్షాలు ప‌డే సూచ‌న‌లున్నట్లు విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.


వరనుడి రాకతో పల్లె ప్రాంతాల్లో రైతుల మొఖంలో ఆనందం వెల్లువిరుస్తోంది. ఈ సారి ముందస్తు వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలపడంతో రైతులంతా ఖరీఫ్ సాగుకు సిద్ధం అవుతున్నారు. కాకాపోతే ఈదురుగాలులతో మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మామిడి సాగు రైతులు. కాకపోతే ఈ ఏడాది గతః రెండు సంవత్సరాల కంటే మెరుగ్గా వర్శాపథం నమోదవుతుందని వాతావరణ శాఖ ఎప్పుడో చెప్పింది...!


మరింత సమాచారం తెలుసుకోండి: