ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనేదీ లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని పార్లమెంటులో కడిగిపారేశారు. గత డిసెంబర్ నెలలో ఏపీ లోక్‌సభ సభ్యుడు అవంతీ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాన్ని ఆయన తప్పుబట్టారు. జయంత్ సిన్హా వాదనను పాయింట్ వైజ్ గా ఖండిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా చేసిన ప్రకటన తమకు బాధ కలిగించిందని జయదేవ్‌ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని జయదేవ్ తన ప్రసంగంలో గుర్తుచేశారు. రాష్ట్రవిభజన సమయంలో ఆనాటి  ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకు విలువ లేకుండా చేస్తారా అని నిలదీశారు. 

ఆంధ్రాను హామీలతో మోసం చేశారు.. 


14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి... ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని జయదేవ్ పార్లమెంట్ లో డిమాండ్‌ చేశారు. యూపీఏ, ఎన్టీయే నేతల మాటలతో మోసపోయామన్న భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కలుగుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా పన్నుల బదలాయింపు జరిగిన తర్వాత కూడా కేవలం ఏపీ ఒక్క రాష్ట్రమే ఆర్థికంగా లోటుతో ఉంటుందన్న సంగతి కేంద్రమంత్రికి బాగా తెలుసని గల్లా చురకలు వేశారు. మంత్రి ఏపీకి ఘనంగా ఇచ్చామని చెబుతున్న జయంత్ సిన్హా ప్రకటనను ఉటంకిస్తూ.. ఇవన్నీ అన్ని రాష్ట్రాలకూ ఇస్తున్న నిధులేనని గుర్తు చేశారు. ఈ అరకొర నిధులతో విభజనతో నష్టోయినా రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటారని జయదేవ్ నిలదీశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: