2019 ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ తనకు ఫుల్ సపోర్ట్ చేయడానికి అతిరథ మహారథులనే ఎన్నుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పిన విషయం మనందరికీ విదితమే. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆయన మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో ఆరితేరిన దాసరిని, మాజీ ఎంపీ మోహన్ బాబును రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసేలా పవన్ ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.


తన జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన దాసరి నారాయణ రావు పవన్ కల్యాణ్ రాజకీయాలపై కూడా స్పందించారు. ధైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లో సక్సెస్ అవుతారని, పవన్ కు ఆ ధైర్యం ఉందని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆయన సున్నితమైన మనసు ఉంటే రాజకీయాల్లోకి రావద్దని, వచ్చినా లేనిపోని బురద అంటుకోవడం తప్ప జరిగేదేం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ ధైర్య వంతుడు, ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతారని అన్నారు.

దాసరి నారాయణ రావు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఆయన అంటున్నప్పటికీ జనసేన పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ బుధవారంనాడు దాసరి నారాయణర రావు నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య సయోధ్య ఎప్పుడో కుదిరిన సూచనలు కనిపిస్తున్నాయి.


ప్రస్తుత వాతావరణం చూస్తుంటే, మోహన్ బాబు పవన్ కల్యాణ్‌తో జత కట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అనిపిస్తోంది. దాసరి నారాయణ రావు మోహన్ బాబుకు గురువు. మోహన్ బాబుకు దాసరి నారాయణ రావు అంటే ఎనలేని అభిమానం ఉంది. దానివల్ల దాసరి నారాయణ రావు రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ను బలపరిస్తే మోహన్ బాబు ఇటు వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద, కొద్ది నెలల్లో పవన్ కల్యాణ్ పార్టీ రూపురేఖలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: