నాకేంటి.. ఇప్పుడు లోకంలో ఎవరి నోట ఇదే మాట. తాయిలాలు ఇవ్వందే ఏ పని పూర్తికాని పరిస్థితి. అందుకే ఇప్పుడు రాష్ట్రాల అధినేతలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలకు రాయితీలు ప్రకటిస్తున్నారు. తెలంగాణలోని పెట్టుబడులు పెట్టే మెగాప్రాజెక్టులకి రాయితీలిచ్చే అంశాన్ని కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుంది. 

ఎక్కువ మందికి ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తామని, ఇతర రాష్ట్రాలకన్నా ఉత్తమంగా రాయితీలు ఇస్తామని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. అయితే కొత్తగా వచ్చే వారీతోపాటు ఇక్కడ ఉన్న పరిశ్రమలు సైతం విస్తరించి మెగా ప్రాజెక్టు కేటగిరిలోకి మారుతున్నాయని, ఈ నేపథ్యంలో వారికి సైతం మెగా ప్రాజెక్టుల రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉపసంఘం నిర్ణయించింది.

పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ రాయితీలు..


మెగా ప్రాజెక్టులకి ఇచ్చే ప్రత్యేకమైన రాయితీలకోసం పరిశ్రమ శాఖలోనే ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉపసంఘం అధికారులను అదేశించింది. టియస్ ఐపాస్ నుంచి వచ్చే అదాయంలో కొంత భాగాన్ని ఈ నిధికోసం వాడుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవాలని ఉపసంఘం నిర్ణయించినట్టు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 

ఇప్పటిదాక 389 మెగా ప్రాజెక్టులకి టియస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకి రాయితీలు ఇచ్చే విషయంలో అర్ధిక శాఖ పాజిటివ్ గా ఉందన్నారు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్. అయితే రాయితీలను పరిశ్రమల ప్రారభంలోనే కాకుండా, పరిశ్రమ పురోగతిని బట్టి దశాల వారీగా ఉండాలని
సూచించారు. మరి ఈ రాయితీల కోసం పారిశ్రామిక వేత్తలు క్యూ కడతారా..!? వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: