కొన్ని శిక్షలు నవ్వు తెప్పిస్తాయి, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అని పోలీసులు అనుకోవాలే కాని ఫైన్ వెయ్యడానికి ఎదో ఒక కారణం భలే దొరుకుతుంది. గోవాలో ఒక ట్రాఫిక్ పోలీసు మహానుభావుడు ఇదే టైపు లో ప్రవర్తించాడు. ఆయన చేసిన పనికి మిగితా పోలీసుల పరువు గంగలో కలిసిపోయింది అంటే నమ్మండి. గోవాలోని పనాజీ దగ్గర బీచ్ సమీపం లో ఒక గ్రామం లో ఏక నాథ్ అనే వ్యక్తి కారులో వెళుతూ ఉండగా ట్రాఫిక్ ఎస్సై హనుషీ అతన్ని అడ్డుకున్నాడు. కారు డ్రైవర్ కి హెల్మెట్ లేదు అంటూ సెక్షన్ 177 ప్రకారం ఫైన్ కట్టాలి అని చలానా రాసాడు. మోటారు వాహన చట్టంలో 177 సెక్షన్ ప్రకారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా లైసెన్స్ లేకపోయినా చలానా రాస్తారు.



కానీ కారు కి హెల్మెట్ ఏంటి అంటూ మీడియా మండి పడింది. దీన్ని సీనియర్ ఆఫీసర్ లు సమర్ధించడం మరొక వింత. పొరపాటున అలా రాసి ఉంటాడు అనీ పొరపాట్లు జరగడం సహజం అనీ చెప్పుకొచ్చారు ఒక సీనియర్ ఆఫీసర్. కారు డ్రైవర్ కి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని మూర్ఖపు ఎస్సై ని ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ మండి పడుతున్నారు మరి కొందరు. అయితే ఆ కారు ఓనర్ కీ ట్రాఫిక్ ఎస్సై కీ మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల కారణంగా ఇదంతా చేసాడు అనీ, ఎప్పటి నుంచో ఇలాంటి అవకాసం కోసం ఎదురు చూస్తున్న ఎస్సై ఇలా బుక్ చెయ్యాలని కావాలనే చేసాడు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: