ఒక‌వైపు ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను త‌మ పార్టీలోకి క‌లిపేసుకుంటునే మ‌రోవైపు  సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు క‌లిసిరావ‌డ‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కంట్ల తార‌క‌రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణలో అన్ని పార్టీలూ ఒకే తాటీమీద‌కు రావాల‌న్నారు. గ‌త రెండు ఏళ్ల కాలం పాల‌కుల న‌డ‌క చూసే ఈ పిలుపున‌కు అర్ధం ఏమిట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక త‌ప్ప‌దు. ఆప‌రేషన్ ఆక‌ర్ష్ మంత్రంతో దాదాపుగా ప్ర‌తిప‌క్షం లేకుండానే ఎత్తులు వేస్తున్నారు గులాబీ ద‌ళ‌ప‌తి. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీలు సాగు నీటి వ్య‌వ‌హారంలో క‌లిసి రావాల‌ని కోరుతున్నారు.  అంద‌రూ ఒకే తాటిమీద‌కు రావ‌ట‌మంటే అంద‌రినీ క‌లుపుకొని పోవ‌ట‌మా?  లేక క‌లుపుకోవ‌ట‌మా? క‌లుపుకొని పోవ‌ట‌మన్న మాట టీఆర్ఎస్ పార్టీ చ‌రిత్ర‌లో ఎక్క‌డా క‌నిపించ‌దు. జ‌రుగుతున్న త‌తంగ‌మంతా క‌లిపేసుకోవ‌ట‌మే. అయితే తాజాగా ఏపీ స‌ర్కార్ నీటిప్రాజెక్టు ల విష‌యంలో తిర‌కాసు పెట్ట‌డంతో సీఎం కేసీఆర్ ప్ర‌తిపక్ష నాయ‌కులను క‌లిసి రావాలి పిలుపునివ్వ‌డం నిజంగా గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మే. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత అనేక స‌మ‌స్య‌లు ముందుకొచ్చాయి. కీల‌క‌మైన ఏ స‌మ‌స్య‌మీద కూడా విప‌క్షాల‌ను సంప్ర‌దించ‌లేదు. 

జ‌నాన్ని ప్ర‌భుత్వం ఆదుకునే ప్ర‌య‌త్న‌మే లేదు


ఇప్పుడు రాష్ట్రం క‌రువుతో విల‌విల లాడుతున్న‌ది. జ‌నాన్ని ప్ర‌భుత్వం ఆదుకునే ప్ర‌య‌త్న‌మే లేదు. ఇలాంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల గురించి ప్ర‌తిప‌క్షాల‌ను సంప్ర‌దించ‌ట‌మ‌న్న ఊసే లేదు. నీటి వ‌న‌రులు, విద్యుత్తు స‌మ‌స్య‌, ఫీజు రీయాంబ‌ర్స్ మెంట్, స్థానిక‌త విష‌యంలోగానీ, హైద‌రాబాద్ లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విదానం గురించి కానీ, రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు చెల‌రేగిన‌ప్ప‌టికీ విప‌క్షాల‌ను విశ్వాసంలోకి తీసుకునే ప్ర‌యత్నం జ‌ర‌గ‌లేదు. అన్నీ ఏక‌ప‌క్ష వాద‌న‌లూ, ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే. ప్ర‌శ్నిస్తే తెలంగాణ వ్య‌తిరేకుల‌ని ముద్ర వేయ‌డం చూసాం. ఇప్పుడు మేడిగ‌డ్డ ప్రాజెక్టు విష‌యంలో కూడా అదే జరిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన ఇంజ‌నీర్ల క‌మిటీ కూడా ఈ ప్రాజెక్టును వ్య‌తిరేకించింది. అయినా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా ముందుకు పోతున్న‌ది. ప్రాజెక్టుల‌న్నీ రీడిజైనింగ్ చేయాల‌న్న నిర్ణ‌యం కూడా ఏక‌ప‌క్ష‌మే. క‌నీసం  మ‌హారాష్ట్ర తో ప్రాణ‌హిత బ్యారేజీ ఎత్తు త‌గ్గించ‌డానిక అంగీక‌రించిన‌ప్పుడైనా విప‌క్షాల అభిప్రాయ కోర‌లేదు. ఇప్పుడు అంద‌రూ క‌లసిరావాల‌న్న పిలుపున‌కు అర్ధం లేదు. ప్రజాస్వామ్యం లో అధికారపక్షం ప్రతిపక్షాలను కలుపుకొని పోవడానికి కొన్ని పద్ధతులున్నాయి. 


తెలంగాణ‌లోని ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దిమ్మ తిరిగి  మైండ్ బ్లాక్ అయ్యేది.


అందరూ ఒకతాటిమీదకు రావాలని బహిరంగ పిలుపు రాజకీయ ఎత్తుగడ అవుతుందే తప్ప, ఆచరణలో నిజంగా కలుపుకోవడానికి తోడ్పడదు. కలుపుకొనిపోవాల్సింది పాలకపక్షం. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం విప‌క్షాల‌ని ఎంతగా వాడేస్తార‌న్న విష‌యంలో త‌నకున్న నైపుణ్యాన్ని  ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌ద‌ర్శించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ చెప్పే మాట‌ల‌కు, ఇచ్చే పిలుపుల‌కు తెలంగాణ‌లోని ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దిమ్మ తిరిగి  మైండ్ బ్లాక్ అయ్యేది. ఈ సంద‌ర్భంగా  ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు త‌ర‌చూ ఒక మాట చెప్పేవారు. ఉద్య‌మ‌నాయ‌కుడికి ఉండే అడ్వాంటేజ్ కేసీఆర్ కు ఉంద‌ని. అందువల్లే ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీల‌ను అంత‌లా ఇబ్బంది పెట్ట‌గ‌లుగుతున్నార‌ని, ఉద్య‌మం పూర్తి అయ్యాక ఆయ‌న అలా చేయ‌లేరంటూ విశ్లేష‌ణ‌లు చేసేవారు. అయితే, ఉద్య‌మం ముగిసి... తెలంగాణ రాష్ట్రంలో అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించిన త‌రువాత కూడా ఉద్య‌మ స‌మ‌యంలో ఏ తీరులో  అయితే త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఏ విధంగా ముప్పుతిప్ప‌లు పెట్టారో.. అధికార ప‌క్షంగా కూడా అదే తీరులో వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది.


అయితే.. ఉద్యమం ముగిసి.. తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంగా అవతరించిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో ఏ తీరులో అయితే తన ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టారో.. అధికారపక్షంగా కూడా అదే తీరులో వ్యవహరించటం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది. ఓపక్క తన అవసరాల కోసం తెలంగాణలోని పార్టీలన్నీ ఏకం కావాలనిచెప్పే కేసీఆర్.. మరోవైపున తెలంగాణలో తాను తప్ప మరే రాజకీయ పార్టీ బలంగా ఉండకూడదన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. ఓ పక్కా త‌న ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయ పార్టీల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, వారి సాయాన్ని  కేసీఆర్ తీరు ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో.  తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు నిర్మించాల‌ని భావిస్తున్న పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం పై తెలంగాణ విప‌క్షాల‌తో పాటు, ఏపీ అధికార విప‌క్షాలు వ్య‌తిరేకించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో డిఫెన్స్ లో ప‌డిన‌ట్లు క‌నిపించిన కేసీఆర్, తాజాగా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం పై తెలంగాణ రాజ‌కీయ పార్టీల‌న్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు.  ఆ ప్ర‌య‌త్నం జ‌రిగితే క‌ల‌సి రావ‌ల్సిన వారు వస్తారా లేదా అనేది తేలుతుంది. 


ఈ రెండేళ్ల కాలంలో ఆప‌రేష‌న్ ఆకర్ష్ కు ప‌దును పెట్టి విప‌క్ష నేత‌ల‌ను పార్టీలో క‌లుపుకోవ‌డం మీదున్న శ్ర‌ద్ద ప్ర‌జాస్వామ్య‌యుతంగా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పాల‌కుల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేసారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నుంచి మొద‌లుకుని నేటి పొంగులేటి శ్రీనివాస్ వర‌కు కీల‌క నాయ‌కుల‌ను పూర్తిగా తన పార్టీలో కి లాగేసుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్ల‌యినా పాల‌కులు భావోద్వేగాల నాశ్ర‌యించ‌డం బ‌ల‌హీన‌త‌. నిన్న‌ది దాకా తెలంగాణ సెంటిమెంట్ తో నెట్టుకొచ్చిన పాల‌కుల మీద ప్ర‌జ‌లు గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తున్నారు. కానీ పాల‌కులిప్పుడు సాగునీటి ప్రాజెక్టుల వివాదం ముందుకు తెచ్చారు. ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే నిర్ణ‌యాలు చేసిన ప్ర‌భుత్వం, ఇప్పుడు ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏక‌మ‌వుతున్నందు వ‌ల్ల‌, ఇక్క‌డ కూడా తెలంగాణ పార్టీల‌న్నీ ఏకం కావాల‌న్నారు. క‌లిసిరాని వారంతా తెలంగాణ వ్య‌తిరేకుల‌ని ముద్ర‌వేసే ఎత్తుగడే ఇది. అంతేకాదు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ విమ‌ర్శించ‌వ‌ద్దు. ప్ర‌శ్నిస్తే తెలంగాణ వ్య‌తిరేకులు! అంతా క‌లిసి ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడాలి. రెండు రాష్ట్రాల పాల‌కుల‌దీ ఒకే ఎత్తుగ‌డ‌. అసలు స‌మస్య నుండి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌లించ‌ట‌మే ల‌క్ష్యం. 


నిన్న‌టి దాకా ఏపీకి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి గురించి న‌మ్మించిన చంద్ర‌బాబు, అది సాద్యం కాద‌ని పార్లమెంట్ లో మంత్రి స్ప‌ష్టం చేయ‌టంతో నోరు మెద‌ప‌లేని స్థితి లో పడ్డారు. ఇప్పుడా స‌మస్య నుంచి ప్ర‌జ‌ల దృష్టికి మ‌రిలించేందుకు కేంద్రం మీద ఒత్తిడి చేసైనా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల‌ను ఆపుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అక్క‌డి ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబును ఎదుర్కోడానికి భావోద్వేగాల‌నే ఎంచుకున్నారు. తెలంగాణ న‌దిజ‌లా స‌మ‌స్య మీద చంద్ర‌బాబు క‌న్నా తానే గొప్ప‌గా పోరాడుతున్న‌ట్లు చూపే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇక్క‌డ ప్ర‌భుత్వాధినేత క‌రువు స‌మ‌స్య‌ను క‌నీస మాత్రం  కూడా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు చంద్ర‌బాబు, జ‌గ‌న్  ల‌ను చూపించి తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం. అంద‌రూ క‌లిసి వ‌స్తే స‌మ‌స్య రెండు రాష్ట్రాల మధ్య ఘ‌ర్ష‌ణ‌గా మార్చ‌వ‌చ్చు. జ‌నం క‌రువు గురించి ప్ర‌శ్నించ‌కుండా చూడ‌వ‌చ్చు. ప్ర‌తిప‌క్షాలు క‌లిసి రాకుంటే  తెలంగాణ వ్య‌తిరేకులుగా చిత్రీక‌రించ‌వచ్చు సెంటి మెంట్ ను సొమ్ము చేసుకోవ‌చ్చు. ఒక్క దెబ్బ కు రెండు పిట్ట‌లు రాలుతాయ‌ని కేసీఆర్ అంచ‌నా!
Click here to Reply or Forward


మరింత సమాచారం తెలుసుకోండి: