తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ప్రత్యేక పోరు కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీకి కూడా వంత పాడింది. కాగా నేడు కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా రక రకాల వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాష్ట్ర ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మనమంతా ఒక్కటవుదామని, కేంద్రం పైన ఉద్యమిద్దామని, ఇందుకోసం సకలం బంద్ చేద్దామని వైసిపి నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహా ఇచ్చారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.  

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని అక్కడి ప్రజల ఐక్యత నాయకుల సమైక్య పోరు కేంద్రం మెడలు వంచేలా చేసిందని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని అందుకోసం కేంద్రం దిగి వచ్చేలా అందరం ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేద్దామని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పారు. ప్రత్యేక హోదా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ధర్నాలు చేస్తుందన్నారు. ఈ నెల 10వ తేదీన అన్ని కలెక్టరెట్ల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు.

ఏపీ ప్రత్యేక హోదా


ప్రత్యేక హోదా సాధిస్తామని బిజెపి, టిడిపిలు తమ మేనిఫెస్టోలో చెప్పాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమని చెప్పినపుడు రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీల వారు తీవ్రస్థాయిలో స్పందిస్తే..తెలుగు దేశం మాత్రం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని బీజేపీతో లాలూచీ కావడంతో ఇలా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ప్రాంతీయ అవసరాలు, అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా పైన నోరు మెదపడం లేదన్నారు. ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని చెప్పడం ఎంత వరకు న్యాయమని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: