ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక హోదాపై రగడ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే అధికార పార్టీ తప్ప అన్ని పార్టీల వారు ఏపీ ప్రత్యేక హోదాపై గళం విప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు కొనసాగాయి..నిరహార దీక్షలు, నిరసనలు ఎన్నో జరిగినా అధికార పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయం పై సాగదీస్తూ వస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావల్సిన ప్రతి పైసాను కేంద్రం ఇచ్చేసిందని అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. దీంతో ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనన్న సంకేతాలను ఆయన పంపించారు.

గురువారం ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలంటూ లోక్‌సభలో ఎంపీలు పట్టుబడటంతో ఆయన వివరణ ఇచ్చారు. విభజన తర్వాత భారీగా నష్టపోయిన ఏపీకి సాయం చేయాలని తమకు తెలుసన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోల్పోవడం వల్ల ఏపీకి రెవెన్యూలోటు ఏర్పడిందన్నారు. ఆంధ్రాలో దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయన్న ఆయన ఏపీకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తామని స్పష్టం చేశారు.  పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 6,403 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు  తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 2,800 కోట్లు ఇచ్చామన్నారు.

ఏపీ  ప్రత్యేక హోదా


రాష్ట్రాన్ని విభజించింది తాము కాదని, అయినా పోలవరం నిధులపై కూడా వెనుకంజ వేయడం లేదని చెప్పారు. యూపీఏ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నాం.. ఏపీకి అండగా నిలిచామని జైట్లీ పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు మాత్రమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువే ఇచ్చామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: