ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాయాలసీమ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఏదో అడపాదడపా సహాయ సహకారాలు అందిస్తుంది తప్పితే, రాయాలసీమ అభివృద్ధికి మాత్రం పాటుపడటం లేదని రాయలసీమ ప్రజలు బతకలేరని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం మండిపడ్డారు. వైసిపి అధినేత జగన్ చేస్తున్న దీక్ష వల్ల రాయలసీమకు నష్టం జరుగుతోందన్నారు.

కారణం, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఆంధ్రా ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే, జగన్ పరిధిలోని ప్రాంతలైనా రాయలసీమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు అననతరం రాయలసీమకు మరిన్ని కష్టాలు తోడయ్యాయని మా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలా ముఖ్యమంత్రులకు ఉందని ఆయన పేర్కొన్నారు. డిండి, పాలమూరు ప్రాజెక్టుల పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ ముగ్గురు చర్చించుకొని ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని సూచించారు. దీక్షల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని చెప్పారు.

 

ఇప్పటికైనా నాయకులంతా కలిసి రాయలసీమను రాతనాలసీమగా మార్చాలనీ, మా సమస్యలను పరిష్కరించాలని రాయలసీమ ప్రజలు, నేతలు కోరుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధనవంతులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇష్టపడటం లేదని సిపిఎం మధు గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పైన పోరాటాల విషయంలో వైసిపి వెనుకబడిందని చెప్పారు.

బిజెపితో విడిపోతే ప్రత్యేక హోదా పోరాటంలో తాము తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అభివృద్ధి కోసమే పొత్తు అని టిడిపి నేతలు చెప్పారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. అదే సమయంలో, ప్రత్యేక హోదా విషయమై కేంద్రం పైన కూడా మధు ధ్వజమెత్తారు. కేంద్రం పైన నమ్మకం పోయిందన్నారు. బిజెపితో దోస్తీ పైన టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. పొత్తుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: